పౌరుషం చచ్చిపోయిందా.. పవన్ పై నిప్పులు చెరిగిన శ్యామల

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల నిప్పులు చెరిగారు. పవన్ కు పౌరుషం చచ్చిపోయిందా కామెంట్స్ చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీడియా సమావేశం నిర్వహించారు. అలానే సీఎం చంద్రబాబుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే శ్యామల చేసిన కామెంట్స్ ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.

శ్యామల మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత నాటి సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. దిశా యాప్ ను ప్రవేశపెట్టి మహిళలకు పూర్తి రక్షణ కల్పించామని.. అబద్ధపు హామీలు గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. నాడు పవన్ తెగ ఊగుతూ మాట్లాడారని, ఇప్పుడు మహిళలకు రక్షణ లేదన్న విషయాన్ని గ్రహించి పవన్ మళ్లీ ఊగుతూ మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లల రక్షణ తన బాధ్యతగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేమయ్యారని ప్రశ్నించారు.

ycp leader shyamala shocking comments on pawan kalyan

రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని స్వయానా పవన్ కళ్యాణ్ చెప్పారని, మహిళా రక్షణకు కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలను విధానాలను ప్రవేశపెట్టిందో చెప్పాలన్నారు. అంతే కాకుండా ఎన్నికల సమయంలో మాట్లాడిన ఆయన మాట్లాడిన వీడియోలను మీడియా సమావేశంలో శ్యామల ప్రదర్శించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో నవరత్నాల పథకాలు పూర్తిస్థాయిలో అమలయ్యాయని శ్యామల చెప్పారు. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసిందని ఆమె దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ ప్రకటించారని.. ఆ హామీలు ఎక్కడ అంటూ శ్యామల ప్రశ్నించారు. ఉచిత బస్సు గురించి సీఎం చంద్రబాబు హామీలు గుప్పించి, ఇప్పుడు కేవలం జిల్లాల వరకే ఉచిత బస్సు అంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు.

సుగాలి ప్రీతి కేసు...

అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసును ఛేదిస్తామని గొప్పలు చెప్పారని, ఇప్పుడు ఆ కేసు ఏమైందంటూ శ్యామల ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు మాటలకు క్రెడిబులిటీ లేదని, మహిళా అభ్యుదయం సాధికారత అంటూ గొప్ప మాటలు చెప్పిన చంద్రబాబు ప్రస్తుతం ఏమయ్యారని ఆమె ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+