ఆ ఎంపీ కక్ష కట్టారు, కేసు వెనుక - విడదల రజనీ సంచలనం..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వైసీపీ హయాంలో అవినీతి.. అక్రమాలకు పాల్పడిన వారి పైన కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. ఇప్పుడు మాజీ మహిళా మంత్రి కు ఉచ్చు బిగిస్తోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూళ్ల కు పాల్పడ్డారనే ఫిర్యాదుల పైన విడదల రజనీ పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. రజనీతో పాటు గా ఐపీఎస్ అధికారి పైనా విచారణకు రంగం సిద్దమైంది. దీంతో, ఈ కేసు పైన రజనీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఎంపీ అయిన నేతను టార్గెట్ చేసారు.
మాజీ మంత్రి పై కేసు
మాజీ మంత్రి విడదల రజనీ పై ఏసీబీ కేసు నమోదైంది. మంత్రిగా ఉన్న సమయంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై రజనీ పైన ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బీ సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఏ1గా విడదల రజిని, ఏ2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది విడదల గోపి, ఏ4గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు.
రెడ్ బుక్ రాజ్యంగం
తన పైన నమోదు చేసిన కేసు పైన విడదల రజనీ స్పందించారు. తనపై అక్రమ కేసు పెట్టారని విమర్శించారు. తనపై ఫిర్యాదు చేసిన వారిని తానెప్పుడూ చూడలేదని చెప్పారు. తానంటే నరస రావుపేట ఎంపీ ఎల్ శ్రీకృష్ణదేవరాయులకు చాలా కోపమని తెలిపారు. అది ఎందుకో తెలియదని వ్యాఖ్యానించారు. ఆ ఎంపీ ఆదేశాలతోనే తనపై కేసు పెట్టారని చెప్పుకొచ్చారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్‌బుక్ పాలనలో భాగం గానే తనపై ఈ అక్రమ కేసు పెట్టారన్నారు. తనపై కేసు పెట్టిన వారు టీడీపీకి చెందిన వారేనని విడదల రజిని వివరించారు. తాను ఏ తప్పు చేయకపోయినా.. తనన ఇబ్బంది పెడుతున్నార ని చెప్పుకొచ్చారు.

నాటి నుంచే కక్ష
వైసీపీలో ఉన్నప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయకులకు తనపై కక్ష ఉందంటూ రజనీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారని రజనీ గుర్తు చేసారు. తనపై విజిలెన్స్ విచారణ చేయడానికి తానేం తప్పు చేశానని రజినీ ప్రశ్నించారు.రజనీ వైసీపీలో ఉన్న సమయంలోనే అప్పుడు నర్సరావుపేట నుంచి వైసీపీ ఎంపీగా ఉన్న లావు శ్రీక్రిష్ణ దేవరాయుల తో విభేదాలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా, మంత్రిగా విడదల రజినీ ఏ రోజు.. లోక్ సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులను పట్టించుకోలేదు. 2024 ఎన్నికల్లో తిరిగి లావు ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు చిలకలూరిపేట కు చెందిన మర్రి రాజశేఖర్ ను టీడీపీలోకి తీసుకో వటంలో ఆయనదే కీలక పాత్ర. కాగా, తాజాగా రజనీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications