MLC అనంత‌బాబు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం.. ప్ర‌జ‌ల ఆలోచ‌నా తీరుకు ద‌ర్ప‌ణం!!

త‌న కారు మాజీ డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం హ‌త్య‌కేసులో నిందితుడిగా ఉన్న MLC అనంత‌బాబు చిత్ర‌ప‌టానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశాయి. అత‌న్ని పార్టీ నుంచి బ‌హిష్క‌రించిన‌ప్ప‌టికీ మ‌న్యం ప్రాంతంలో ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా వైసీపీ శ్రేణులు అనంత‌బాబు చిత్ర‌ప‌టాన్ని ఉంచుతున్నారు. అల్లూరి సీతారామ‌రాజు జిల్లా దేవీప‌ట్నం మండ‌లం ఇందుకూరు పేట‌లో మంగ‌ళ‌వారం గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్రమానికి రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే నాగులాప‌ల్లి ధ‌న‌ల‌క్ష్మి హాజ‌ర‌య్యారు. అన‌త‌రం ఆర్ అండ్ బీ ప్ర‌ధాన ర‌హ‌దారిపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు అనంత‌బాబు చిత్ర‌ప‌టాన్ని ఊరేగిస్తూ పాలాభిషేకం చేశారు.

ఒక వ్య‌క్తిని హ‌త్య చేసిన‌ట్లు స్ప‌ష్టంగా ఆధారాలు క‌న‌పడుతున్న‌ప్ప‌టికీ ఎమ్మెల్సీ అనంత‌బాబు చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేయ‌డంపై సామాజిక‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మారుతున్న ప్ర‌జ‌ల ఆలోచ‌నా తీరుకు ఈ కార్య‌క్ర‌మం అద్దం ప‌డుతోంద‌న్నారు. మ‌న ఆలోచ‌న‌ల‌ను బ‌ట్టే నాయ‌కుల‌ను ఎన్నుకుంటామ‌ని, నాయ‌కులు అలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. ప‌నులు చేయ‌డంలేదంటూ వారిని విమ‌ర్శించే హ‌క్కు ప్ర‌జ‌ల‌కు లేద‌న్నారు. ఎందుకంటే ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలోనే ఎవ‌రిని ఎంచుకోవాలో ప్ర‌జ‌లు ఒక స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని, అలా కాకుండా తాత్కాలిక ప్ర‌లోభాలకు లొంగిపోయి నేర‌స్తుల‌ను ఎన్నిక‌ల్లో ఎన్నుకుంటే ఇప్పుడు మ‌నం చూస్తున్న పాలాభిషేకాల్నే భ‌విష్య‌త్తులో మ‌రిన్ని చూడాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Anointing for MLC Anantha Babu movie .. A mirror to the way people think !!

Recommended Video

    AP CM Jagan made changes in Arogya Sri *Andhrapradesh | Telugu OneIndia

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనంతబాబును బ‌హిష్క‌రించిన‌ప్ప‌టికీ, అత‌ను జైలులో ఉన్న‌ప్ప‌టికీ అదేదో గొప్ప ఘ‌నకార్య‌మ‌న్న‌ట్లుగా అనంతబాబు అనుచరులు, స్థానికులు వ్య‌వ‌హ‌రించ‌డంపై సామాజిక‌వేత్త‌లు మ‌రింత ఆందోళ‌న చెందుతున్నారు. స‌మాజంలో ప్ర‌జ‌ల ఆలోచ‌నాతీరులో వ‌స్తున్న మార్పుల‌కు ఈ సంఘ‌ట‌న అద్దం ప‌డుతోంద‌న్నారు. ఏది మంచో? ఏది చెడో? అర్థం చేసుకునే ధోర‌ణి ప్ర‌జ‌ల‌కు ఉంద‌ని, మ‌రి ఈ పాలాభిషేకం కార్య‌క్ర‌మాన్ని వారు ఎలా తీసుకుంటారో తెలియాలంటే కొద్దికాలం వేచిచూడాల్సిందేన‌ంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+