చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ శ్రేణుల సంబరాలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే చోటు చేసుకుంటున్న పరిణామాలు దేశం దృష్టిని ఒక్కసారిగా ఏపీ రాజకీయాలపై కి మళ్లే విధంగా చేశాయి. ఇప్పటికే చంద్రబాబుకు ఐటి నోటీసులు జారీ చేయగా, తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు.
ఇంతకు ముందు చంద్రబాబు ఊహించిన విధంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగింది. చంద్రబాబు తన అరెస్ట్ గురించి సంచలన ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే ఆయన అరెస్ట్ జరిగింది. శనివారం ఉదయం నంద్యాలలో చాలా సేపు హై డ్రామా తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్న ఏపీ సిఐడి అధికారులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనను విచారించనున్నారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు జరగడంపై వైసిపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. అన్నమయ్య జిల్లా పీలేరులో బాణసంచా కాల్చి, వైసిపి శ్రేణులు స్వీట్లు పంచుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసిన వైసీపీ నేతలు సంతోషంలో మునిగిపోయారు.
చంద్రబాబుకి తగిన తగిన శాస్తి జరిగిందని, ఇంత కాలానికి చంద్రబాబు పాపం పండిందని నినాదాలు చేశారు. ఇక మరోవైపు ఏపీ వ్యాప్తంగా అరెస్టుకు నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. టిడిపి నేతలు చంద్రబాబు పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు.
ఇక చంద్రబాబు అరెస్ట్ ను పవన్ కళ్యాణ్ , పురందరేశ్వరి తదితరులు ఖండించారు. ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును అదుపులోకి తీసుకున్న అధికారులు చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
109 (ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్), 120బీ (కుట్ర), 166, 167 (క్రిమినల్ నేచర్), 420, 418 (చీటింగ్), 465 (ఫోర్జరీ), 468 (ఫ్యాబ్రికేటేడ్ డాక్యుమెంట్స్ తయారు చేయడం),471 (అబద్దాలను నిజం చేయడం), 409 (నమ్మకద్రోహం) కేసులు ఉన్నాయి. టిడిపి లీగల్ సెల్ చంద్రబాబు అరెస్టుపై ప్రస్తుతం న్యాయ పోరాటానికి రెడీ అయింది.












Click it and Unblock the Notifications