Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూడుసార్లు ముఖ్యమంత్రి, రెండుసార్లు ప్రధాని, టైమ్ చూసి జగన్ ను దెబ్బకొట్టిన నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడటంతో వైసీపీ నాయకులు డైలమాలో పడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించి మాట్లాడితే మా పరిస్థితి ఏమిటి ? అని చాలా మంది నాయకులు అయోమయంలో పడిపోయారని తెలిసింది. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వం మీద ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలు చెయ్యడంతో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలో మంచి ఊపు వచ్చింది.

ముఖ్యంగా రాయలసీమ చాలా మంది ముఖ్యమంత్రులను ఇచ్చిందని, అయితే ఎవ్వరూ రాయలసీమకు సరైన న్యాయం చెయ్యలేదని ప్రధాని మోదీ ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా రాయలసీయకు చెందినవాడే కావడంతో మోదీ వ్యాఖ్యలకు చాలా ప్రధాన్యత ఏర్పడింది. రాయలసీమలోని యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మోదీ ఆరోపించారు.

YCP leaders fell into a dilemma after Prime Minister Modi accused Jagan s government

వైసీపీ ప్రభుత్వం పేదల వికాసం కోసం పని చెయ్యడం లేదని, మాఫియా వికాసం కోసం పని చేస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యలు చెయ్యడంతో రాయలసీమలోని వైకాపా నాయకులకు హడలిపోతున్నారని తెలిసింది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావాలని, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కినొక్కి చెప్పడం కూడా వైసీపీ నాయకులకు మింగుడుపడటం లేదని తెలిసింది.

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడం కోసం ఎన్నికల రాజంపేట లోక్ సభ నియోజక వర్గం పరిధిలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని టార్గెట్ చేసుకుని రౌడీ రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యలు చెయ్యడంతో వైసీపీ నాయకులు బిత్తరపోతున్నారని తెలిసింది. ఎన్నికల షెడ్యూల్ మొదలైన సమయంలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వచ్చిన ప్రధాని మోదీ ఆరోజు సీఎం జగన్ ను, వైసీపీ నాయకులను ఏమాత్రం విమర్శించకుండా వెళ్లిపోయారు.

YCP leaders fell into a dilemma after Prime Minister Modi accused Jagan s government

మా సీఎం జగన్ మంచివాడని, అందుకే ప్రధాని మోదీ మా నాయకుడిని ఒక్కమాట కూడా అనలేదని వైసీపీ నాయకులు సంకలు గుద్దుకున్నారు. అయితే ఇప్పుడు అదే మోదీ వైసీపీని, ఆంధ్రప్రదేశ్ లోని జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేయడంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలిసింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రధాన మంత్రిగా పని చేసిన నరేంద్ర మోదీకి ఎప్పుడు, ఎక్కడ ఏమి మాట్లాడాలో తెలుసని, టైమ్ చూసి వైసీపీని టార్గెట్ చేశారని కూటమి నాయకులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన అధికారులు వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని వారి మీద ఈసీ వేటు వెయ్యడంతో వైసీపీ నాయకులు హడలిపోయారని తెలిసింది. మొత్తం మీద ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంలో వైసీపీ నాయకుల్లో ఉన్న ఉత్సాహం రానురాను సన్నగిల్తుతోందని తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలతో సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులు ఎలంటి వ్యాఖ్యలు చేస్తారో అని ఆంధ్రులు వేచి చూస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+