వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈఎస్ఐ స్కామ్ లో తండ్రీ కొడుకులకు వాటా .. వచ్చే ఏడాది మహానాడు జైల్లోనే : వైసీపీ నేతల ధ్వజం

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఈఎస్ఐ స్కామ్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడంతో టిడిపి నేతలు వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు అచ్చెన్నాయుడు రాకుండా అడ్డుకోవడంలో భాగంగానే ఆయనను అరెస్టు చేశారని, ఒక బీసీ నేతపై కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు.ఇక దీనికి సమాధానంగా వైసీపీ మంత్రులు, వైసిపి ముఖ్య నాయకులు టిడిపి నాయకులకు చురకలు అంటిస్తున్నారు .

మంత్రిని నేనా .. మీరా ?డైరెక్టర్ లను బెదిరించిన అచ్చెన్న..సాక్ష్యాలున్నాయని బాంబు పేల్చిన హోంమంత్రి మంత్రిని నేనా .. మీరా ?డైరెక్టర్ లను బెదిరించిన అచ్చెన్న..సాక్ష్యాలున్నాయని బాంబు పేల్చిన హోంమంత్రి

అవినీతిలో చంద్రబాబు, నారా లోకేష్ లకు వాటా

అవినీతిలో చంద్రబాబు, నారా లోకేష్ లకు వాటా


ఈఎస్ఐ కుంభకోణంలో జరిగిన అవినీతిలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ లకు వాటా ఉందని తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపణలు గుప్పించారు. ఇక అచ్చెన్నాయుడుని కలవాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని చెప్పిన మంత్రి కావాలని చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు.150 కోట్ల రూపాయల అవినీతిలో వారికి వాటా ఉన్నందునే అసలు విషయం పక్కన పెట్టి అచ్చెన్నాయుడు అరెస్టు అన్యాయమని రాజకీయ రంగు పులుముతున్నారని మండిపడ్డారు.

అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు చెప్పగలరా ?

అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు చెప్పగలరా ?

ఇక ఈఎస్ఐలో అవినీతి జరగలేదని చంద్రబాబు చెప్పగలరా? అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటూ ప్రశ్నించారు బొత్స. ఇక అరెస్టు అన్యాయమని మాట్లాడితే సరిపోతుందా అంటూ మండిపడ్డారు. ప్రతి దాన్ని రాద్ధాంతం చేయడం టిడిపి నాయకులకు అలవాటైపోయింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక మరోవైపు వైయస్సార్ సిపి అధికార ప్రతినిధి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ టిడిపి నేతలపై ధ్వజమెత్తారు.

పేదల సొమ్ము పందికొక్కుల్లా తిన్నారు

పేదల సొమ్ము పందికొక్కుల్లా తిన్నారు

పేదల సొమ్మును టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, కొందరు అధికారులు కలిసి పందికొక్కుల్లా తిన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అచ్చెన్నాయుడు అరెస్ట్ ను కిడ్నాప్ గా అభివర్ణిస్తూ, రాజకీయం చేసి కులాలకు ఆపాదిస్తున్నారు అని మండిపడ్డారు. అవినీతికి కల, మతాలతో సంబంధం లేదని, ఎవరు చేసినా అవినీతే అని ఆయన పేర్కొన్నారు. ఇక విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించడానికి తీరికలేని చంద్రబాబు ఒక దొంగను అరెస్ట్ చేస్తే పరామర్శించడానికి టైం దొరికిందా అంటూ విమర్శలు గుప్పించారు.

Recommended Video

Vizag Gas Leak : YCP MLA's Responded On Gas Leak Incident & Slams TDP
 బాబు, కొడుకు జైలుకెళ్లే రోజులు త్వరలోనే

బాబు, కొడుకు జైలుకెళ్లే రోజులు త్వరలోనే


టిడిపి హయాంలో ఆరు లక్షల కోట్ల అవినీతిని ఆధారాలతో సహా బయట పెడతామన్నారు.చంద్రబాబు చేసిన అరాచకాలను, అన్యాయాలను మరిచిపోయి సీఎం జగన్ పై విమర్శలు గుప్పించడం దారుణమని ఆయన మండిపడ్డారు. త్వరలోనే చంద్రబాబు అండ్ టీం జైలుకెళ్లే రోజులు వస్తాయని పేర్కొన్నారు. ఇటీవల టీడీపీ మహానాడు జూమ్ యాప్ లో జరుపుకుంటే వచ్చే ఏడాది జైల్లో జరుపుకుంటారు అంటూ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.

English summary
Recently, Minister Botsa Satyanarayana alleged that Opposition leader Chandrababu Naidu and his son Nara Lokesh had a stake in the corruption in the ESI scam.ycp spokesperson gudivada amarnath says that the recent TDP Mahanadu conducted in zoom app and mahanadu celebrated in jail next year,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X