ఆపరేషన్ గరుడ వ్యాఖ్యలపై...హీరో శివాజీని విచారించండి:విజయవాడ సిపికి వైసీపీ నేతల ఫిర్యాదు

విజయవాడ: హీరో శివాజీపై వైసీపీ నేతలు విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ గరుడ వ్యాఖ్యలపై శివాజీని విచారించాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

"ఆపరేషన్ గరుడ"లో ప్రతిపక్ష నేత జగన్ పై దాడి జరుగుతుందని హీరో శివాజీకి ముందే ఎలా తెలుసో చెప్పాలని నిలదీస్తున్న వైసీపీ నేతలు ఆ మేరకు తమ ఫిర్యాదులో పలు అనుమానాలు వ్యక్తం చేశారు. జగన్‌పై దాడి కేసులో హీరో శివాజీ పాత్ర ఉందని వారు అనుమానం వెలిబుచ్చారు. హీరో శివాజీపై సిపికి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతల్లో మల్లాది విష్ణు, వెల్లంపల్లి, గౌతంరెడ్డి తదిదరులు ఉన్నారు.

 శివాజీపై...సిపికి వైసిపి ఫిర్యాదు

శివాజీపై...సిపికి వైసిపి ఫిర్యాదు

ఇటీవల "ఆపరేషన్ గరుడ" పేరుతో కేంద్రం కుట్ర అంటూ హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో శివాజీ "ఆపరేషన్ గరుడ" గురించి వివరిస్తూ ప్రతిపక్ష నేతపై ప్రాణహాని లేనట్టి దాడి జరుగుతుందని, ఈ దాడి నెపంతో ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో ప్రతిపక్ష నేత జగన్ పై దాడి జరుగగా...ఈ దాడి ఆపరేషన్‌ గరుడలో భాగమేనని సిఎం చంద్రబాబుతో సహా టిడిపి మంత్రులు, ఆ పార్టీ ముఖ్య నేతలు ఈరోపణల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

అప్పట్లో...శివాజీ ఏం చెప్పారంటే

అప్పట్లో...శివాజీ ఏం చెప్పారంటే

ఆపరేషన్ గరుడ గురించి శివాజీ ఇంకా ఏం చెప్పారంటే...‘‘సీబీఐ కేసులు తెరవడం, ఆ పార్టీకి చెందిన వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, చక్రబంధంలో ఇరికించడం...2019 నాటికి ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఆపరేషన్‌ గరుడ లక్ష్యం. దీనికోసం రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మరో ముఖ్య పార్టీని, కొత్త పార్టీని ఉపయోగించుకుంటారు. ఈ వ్యూహంలోకి కొందరు అభిమన్యుల్లా ప్రవేశిస్తారు."

ఈ దాడితో...రాష్ట్రంలో అలజడులు

ఈ దాడితో...రాష్ట్రంలో అలజడులు

"ఇలా వచ్చేవారిలో ఒక కొత్త నాయకుడూ ఉన్నారు. ఇప్పటికే ఉన్న ముఖ్యపార్టీ నాయకుడిపైన ఇప్పటికే గుంటూరు, హైదరాబాద్‌లో రెక్కీ నిర్వహించారు. ఆయనకు ప్రాణహాని లేకుండా దాడి జరుగుతుంది. ఈ దాడివల్ల రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి'' అని శివాజీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.

శివాజీని విచారించండి...వైసిపి వినతి

శివాజీని విచారించండి...వైసిపి వినతి

ఈ నేపథ్యంలో హీరో శివాజిపై విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేసిన వైసిపి నేతలు విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై జరిగిన దాడి కేసులో శివాజి పాత్ర కూడా ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఆపరేషన్ గరుడపై శివాజి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనను కూడా విచారించాలంటూ వారు తమ ఫిర్యాదులో కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+