ఏపీలో వైసీపీ నేతలు, మంత్రుల బెదిరింపుల దుమారం .. తాజాగా ఎస్సైకి మంత్రి జయరాం వార్నింగ్ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతల బెదిరింపుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇటీవల కాలంలో వైసీపీ నేతల ఆడియోలు, వీడియోలు వైరల్ గా మారుతున్న తీరు షాక్ కు గురి చేస్తుంది. తాజాగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి ఓ కాంట్రాక్టర్ ని బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. కనేకల్ నుండి నల్లంపల్లి వరకు చేపట్టిన రోడ్డు పనులను ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా మొదలు పెడతారని, ఎమ్మెల్యే ను కలిసిన తర్వాతనే పనులు చేయాలని బెదిరింపులకు దిగినట్లుగా ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది. ఇక ఈ ఘటన ఏపీ రాజకీయ వర్గాల్లో దుమారం రేపగా, తాజాగా మరో ఉదంతం ఏపీ రాజకీయ వర్గాలను ఆలోచించేలా చేస్తోంది.

ఇసక క్రమ రవాణా ... ఎస్సై కు మంత్రి జయరాం బెదిరింపులు

ఇసక క్రమ రవాణా ... ఎస్సై కు మంత్రి జయరాం బెదిరింపులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోందని, ఇసుక అక్రమ రవాణా వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని చాలా కాలం నుండి తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ పార్టీ నేతలే శాండ్ మాఫియాగా మారి దందాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక తాజాగా ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ఎస్ఐ ని మంత్రి జయరాం బెదిరింపు సంభాషణ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇసుక అక్రమ రవాణాపై ఓ పోలీసు అధికారితో మంత్రి జయరాం జరిపిన సంభాషణ ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

ఇసుక ట్రాక్టర్లు వదిలెయ్యాలని మంత్రి జయరాం హుకుం

ఇసుక ట్రాక్టర్లు వదిలెయ్యాలని మంత్రి జయరాం హుకుం

ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎస్సైతో సంభాషించారు. ఖాళీ ఇసుక ట్రాక్టర్ లను పట్టుకున్నారని, నలభై మంది తన దగ్గరకు వచ్చారని ఎస్సైతో మాట్లాడిన మంత్రి జయరాం పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేయాలని ఎస్ఐ హుకుం జారీ చేశారు. అయితే ఎస్ఐ ఇసుక అక్రమ తవ్వకాలు చెయ్యొద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వుకోవాలని ఆయన సూచించారు. ఇల్లీగల్ గా ఇసుక రవాణా చేయొద్దని, లీగల్ గా ఇసుక తీసుకెళ్లడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని వారికి చెప్పినట్లుగా ఎస్ఐ పేర్కొన్నారు.

ఎస్సై ను బెదిరించిన మంత్రి జయరాం

ఎస్సై ను బెదిరించిన మంత్రి జయరాం

ఎస్సై చెబుతున్న విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి జయరాం ఉన్న ఇసుక ట్రాక్టర్లను తక్షణం వదిలేయాలని, లేనిపక్షంలో అధికారంలో ఉన్నప్పటికీ ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. తనకు మంత్రి పదవి ఎక్కువేం కాదని, తనకు తన ప్రజలు కావాలని పేర్కొన్న మంత్రి, మరోసారి పోటీ చేసేది కూడా తానేనంటూ వ్యాఖ్యానించారు. తాను గెలిస్తేనే అక్కడ వ్యవహారం నడుస్తోందని పేర్కొన్న మంత్రి జయరామ్ ఇసుక ట్రాక్టర్లను వదిలేస్తారా లేదా ధర్నాకు దిగుతాను అంటూ ఎస్సైను బెదిరించిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 రాయదుర్గంలోనూ కాంట్రాక్టర్ ను బెదిరించిన వైసీపీ నేత

రాయదుర్గంలోనూ కాంట్రాక్టర్ ను బెదిరించిన వైసీపీ నేత


ఇదిలా ఉంటే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు జయరామిరెడ్డి ఉదంతం కూడా ఏపీలో హాట్ టాపిక్ అయింది. వైసీపీ నాయకుడు జయరామిరెడ్డి, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు. ఆయన ఓ రోడ్డు కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యేకు కలవకుండా పనులు చెయ్యకూడదని బెదిరింపులకు పాల్పడ్డారు. రహదారి పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. పనులు ఆపకపోతే భౌతిక దాడులకు దిగుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ బెదిరింపు ఉదంతాలను అవకాశంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకుల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతోంది.

 దొంగలు ,స్మగ్లర్లు, మోసగాళ్ళు అంటూ టీడీపీ ధ్వజం

దొంగలు ,స్మగ్లర్లు, మోసగాళ్ళు అంటూ టీడీపీ ధ్వజం

దొంగలు, స్మగ్లర్లు, జైలు పక్షులు, మోసగాళ్లు, డ్రగ్ వ్యాపారులు, హవాలా కింగ్ లు, కబ్జాకోరులు... కామ పిశాచులు... వీరందరికీ రాజకీయ ఆశ్రయం కల్పించడానికే వైసీపీ పెట్టినట్టుంది. పార్టీ పెట్టినాయనకి బోలెడంత నేర చరిత్ర ఉందనగానే దొంగలంతా వచ్చి చేరారా అనిపిస్తుంది అంటూ టిడిపి వైసిపి సర్కార్ పై ధ్వజమెత్తింది. వైసీపీ నేతల బెదిరింపుల నేపథ్యంలో జగన్ పై కూడా తెలుగుదేశం పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది.

పోలీసులు , అధికారులే రాష్ట్రంలో తాజా పరిస్థితికి కారణంఅన్న టీడీపీ

పోలీసులు , అధికారులే రాష్ట్రంలో తాజా పరిస్థితికి కారణంఅన్న టీడీపీ

పోలీసులు, అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారినప్పుడు మాఫియాలు రెచ్చిపోతాయని టిడిపి నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు ఒకపక్క ప్రేమోన్మాది దాడిలో దారుణ మరణానికి గురైన రమ్య హత్య కేసులో ఇప్పటివరకు నిందితుడికి శిక్ష పడలేదని మాటల దాడి కొనసాగిస్తూనే, మరోపక్క రాష్ట్రంలో వైసిపి మాఫియా రెచ్చిపోతున్నారు అంటూ నిప్పులు చెరుగుతున్నారు. వైసిపి హయాంలో రాష్ట్రంలో పరిపాలన అధ్వాన్నంగా మారిందని, ఏపీ రౌడీరాజ్యంగా మారిందని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు.

Recommended Video

    Spl Report On Trs LeadersCounter To Revanth Reddy
    ఎక్కడ చూసినా అరాచకమే అంటూ ధ్వజం

    ఎక్కడ చూసినా అరాచకమే అంటూ ధ్వజం

    ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు రాజ్యమేలుతున్నాయి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భూకబ్జాలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని, ఎర్రచందనం స్మగ్లింగ్ కు వైసీపీ నేతలే కారణమని, వైసీపీ నేతలు వల్లనే లిక్కర్ మాఫియా పెట్రేగి పోతోందని, ఏపీలో మద్యం ఏరులై పారుతుందని, పేకాటరాయుళ్ళు పెరిగిపోతున్నారని, గతంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు కొనసాగుతున్నాయని, రాయలసీమ ప్రాంతాలలో విచ్చలవిడిగా నాటుబాంబులతో దాడులు కొనసాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. ఇక రక్షకులు భక్షకులుగా మారుతున్నారని పోలీసు వ్యవస్థను సైతం టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు జగన్ సర్కార్ కు తలనొప్పిగా తయారవుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+