గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చర్చనీయాంశం:గుంటూరు బార్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు

|
Google Oneindia TeluguNews

గుంటూరు:గుంటూరులో తాజాగా జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలు జిల్లాలో చర్చనీయాశంగా మారాయి. గురువారం బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది పోలూరి వెంకటరెడ్డి ఘన విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఈయన తన సమీప ప్రత్యర్థి మల్లవరపు శేఖర్‌బాబుపై 358 ఓట్ల భారీ మెజార్టీతో విజయం పొందారు. 2018-19 సంవత్సరానికి గురువారం జరిగిన ఎన్నికల ఫలితాలను రాత్రికే ప్రస్తుత బార్ అధ్యక్షుడు దాసరి ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఉపాధ్యక్షుడుగా కవిపురపు పట్టాభిరాముడు ఎన్నికయ్యారు. అయితే న్యాయవాదులకు సంబంధించిన ఎన్నికలు ఇప్పుడు గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. కారణం...

 YCP Man elected as Guntur Bar Association president

తాజా ఎన్నికల్లో గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన పోలూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సిపి వైఎస్‌ఆర్సీపీ గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు
కావడమే. అంతేకాదు అధ్యక్ష పదవికి ఇలా వైసిపికి చెందిన వ్యక్తి పోటీ పడుతుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిడిపి ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఆయన్ని ఓడించేందుకు శాయశక్తులా కృషిచేసినట్లు తెలుస్తోంది. ఎలాగంటే...స్వయంగా న్యాయవాది, గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యుడైన టిడిపి మంత్రి నక్కా ఆనందబాబు...ఈ ఎన్నికల్లో పోలూరి వెంకటరెడ్డిపై పోటీ చేస్తున్నమల్లవరపు శేఖర్‌బాబుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతేకాదు ఆయనకు తాను ఓటు వేయడమే కాకుండా ఆయనకు ఓటు వేసేందుకు న్యాయవాదులను కూడ గట్టే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో ఈ బార్ అసోసియేషన్ ఎన్నికలు అనధికారికంగా టిడిపి, వైసిపి పార్టీల ఎన్నికల్లా మారిపోవడంతో...దీంతో ఈ ఎన్నికల ఫలితాలు అధికార,ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో గుంటూరు బార్ అసోసియేషన్ లో మొత్తం 2042 మంది న్యాయవాదులకు ఓటు ఉండగా 1701 మంది తమ ఓటు హక్క వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగగా రాత్రి 10 గంటలకు ఫలితాలు వెల్లడించారు.

ఈ ఎన్నికల్లో పోలూరి వెంకటరెడ్డికి 991 ఓట్లు రాగా ప్రధాన ప్రత్యర్థి శేఖర్‌బాబుకు 632 ఓట్లు లభించాయి. మరో అభ్యర్థి మంగళపూరి శ్రీనివాసరావుకు 66 ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో పోలూరి వెంకటరెడ్డికి 359 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కవిపురపు పట్టాభిరాముడు 1059 ఓట్లు సాధించి 594 ఓట్లు సాధించిన తన ప్రత్యర్థి దాసరి శ్రీనివాసరావుపై 655 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ న్యాయవాద కుటుంబంలో పార్టీలు ఉండవని, తనకు తన పార్టీ వారితో పాటు అన్ని పార్టీల న్యాయవాదులు ఓట్లు వేశారని, న్యాయవాదుల సంక్షేమమే లక్ష్యంగా పార్టీలకు అతీతంగా, న్యాయవాదుల సంక్షేమం కోసం కృషిచేస్తానని చెప్పడం గమనార్హం.

అయితే అధ్యక్షుడిగా పోటీచేసిన న్యాయవాది వైసిపి గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కావడం, ఆయనకు వ్యతిరేకంగా మంత్రి నక్కా ఆనందబాబు రంగంలోకి దిగి ఓడించేందుకు ప్రయత్నించడం, అయినప్పటికి వైసిపి వ్యక్తి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించడం...ఇందులో సామాజిక వర్గాల కోణాలు కూడా ఉండటంతో ఎన్నికల సమయంలోనే ఇవి ఆసక్తికరంగా మారి ఉత్కంఠ రేపాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలు ఈ రెండు పార్టీల్లోనే కాకుండా ఇతర పార్టీలు, వివిధ అసోసియేషన్లలో చర్చనీయాంశంగా మారాయి.

English summary
Guntur: Senior advocate Poluri Venkata Reddy was elected as the president of the Guntur Bar Association on Thursday. He won with 359 votes against his opponent M.Sekhar Babu. But it is noteworthy that who won in this election as President Venkat Reddy is the president of the YCP Legal Cell of Guntur District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X