నందమూరి మోక్షజ్ఞ కోసం రంగంలోకి దిగిన నారా లోకేష్

నందమూరి అభిమానులు గత కొన్నేళ్లుగా ఒకే ఒక్క ప్రశ్నతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.. "చినబాబు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఎప్పుడు?" అని. నందమూరి నటవారసుడిగా మోక్షజ్ఞ తేజ సినీ రంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు వార్తలు రావడం, ఆ తర్వాత అవి సైలెంట్ అయిపోవడం పరిపాటిగా మారింది. 'ఇదిగో వస్తున్నాడు.. అదిగో కథ ఓకే అయింది' అనే ప్రచారాలే తప్ప, ఇప్పటివరకు మోక్షజ్ఞ అధికారికంగా కెమెరా ముందుకు రాకపోవడంతో ఫ్యాన్స్‌లో రోజురోజుకూ అసహనం పెరిగిపోతోంది.

ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఏమైంది?

గత ఏడాది టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా దాదాపు ఖరారైందంటూ అధికారికంగానే లీకులు వచ్చాయి. ఆ సమయంలో మోక్షజ్ఞ సరికొత్త లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. సినిమా పేరు కూడా సింబా. నందమూరి అందగాడిగా బాడీ మేకోవర్ మార్చేసిన మోక్షజ్ఞను చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. స్వయంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన తమ్ముడికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే, ఏమైందో ఏమో కానీ ఆ ప్రాజెక్ట్ ఆశించినంత వేగంగా ముందుకు కదలలేదు. దీంతో చినబాబు ఎంట్రీ మరోసారి వాయిదా పడినట్లైంది. గతంలో బాలకృష్ణ సైతం తన కొడుకు ఎంట్రీపై పలుమార్లు స్పందించారు. బాలయ్య కెరీర్‌లో మైల్‌స్టోన్ లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీ 'ఆదిత్య 369' సీక్వెల్ (ఆదిత్య 999 మాక్స్) ద్వారా మోక్షజ్ఞను పరిచయం చేస్తారని, దానికి బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహిస్తారని కూడా ప్రచారం గట్టిగానే సాగింది. కానీ ఆ ఆలోచన కూడా కార్యరూపం దాల్చలేదు.

Nara Lokesh Pushes Ahead with Plans for Nandamuri Mokshagna Launch

బావమరిది కోసం రంగంలోకి నారా లోకేష్!

ఇక ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో సరికొత్త ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను బావ నారా లోకేష్ తన భుజాలపై వేసుకున్నట్లు సమాచారం. బావమరిదిని గ్రాండ్‌గా లాంచ్ చేసి ఇండస్ట్రీలో సెటిల్ చేసేందుకు లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారని వినికిడి. ఇందులో భాగంగా మోక్షజ్ఞ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులు చెప్పిన కథలను కూడా ఆయన విన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే ఎలాగైనా ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే పట్టుదలగా ఉన్నారట. అయితే దీనిపై నందమూరి కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన

ఒకవైపు నందమూరి తారకరామారావు కేవలం 18 ఏళ్ల వయసులోనే హీరోగా ఇండస్ట్రీని శాసించడం మొదలుపెట్టారు. కానీ ప్రస్తుతం మోక్షజ్ఞకు 31 ఏళ్లు వచ్చినా ఇంకా మొదటి సినిమా పట్టాలెక్కకపోవడం అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. గత అనుభవాల దృష్ట్యా ఇప్పుడు వస్తున్న వార్తలను నమ్మాలో లేదో తెలియక ఫ్యాన్స్ డైలామాలో ఉన్నారు. లుక్ పరంగా కటౌట్ అదిరిపోయేలా సిద్ధం చేసుకున్న నందమూరి యంగ్ స్టార్.. మరి నటనలో ఏ మేర మెప్పిస్తాడో చూడాలి. ఏదేమైనా, ఈసారైనా ఈ ప్రచారాలు నిజమై, చినబాబు సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరగా రావాలని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+