వైసిపి కీలక నిర్ణయం : 31 మందితో మేనిఫెస్టో కమిటీ : నెలాఖరు నాటికి సిద్దం..!
మరి కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో వైసిపి తమ కార్యాచరణ వేగవంగం చేసింది. ఇందులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ప్రకటించింది. సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకేటశ్వర్లు అధ్యక్షతన 31 మంది తో ఈ కమిటీ ఏర్పాటైంది. ఏపిలోని అన్ని ప్రాంతాలు..అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులకు ఇందులో భాగ స్వామ్యం కల్పించారు. ఈ కమటీ తమ సమావేశాలను తక్షణం ప్రారంభించాలని పార్టీ అధినేత జగన్ ఆదేశించారు.

మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు..
సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ తమ కార్యాచరణను మరింత ముమ్మ రం చేసింది. దీనిలో భాగంగా మేనిఫెస్టో కమిటీని తాజాగా ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు 31 మందితో కూడిన మేనిఫెస్టో కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా.. సీనియర్ నేతలు మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి, పెద్దిరె డ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బుగ్గ న రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకటర రమణ, కొడాని నాని, రాజన్న దొర, అంజద్ భాషా, పుష్ప శ్రీవాణి, ఆదిమూలపు సురేశ్, దువ్వారి కృష్ణ, సాంబశివారెడ్డి, కురసాల కన్నబాబు, ఇక్బాల్ లకు అవకాశం కల్పించారు.

ప్రాంతాలు..సామాజిక వర్గాల వారీగా..
ఈ కమిటీలో ఏపిలోని అన్ని ప్రాంతాల వారికి..అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పించారు. వారి స్థానిక పరిస్థితులు. ప్రజలు కోరుకుంటున్న అంశాలు..పార్టీ పరంగా ఇవ్వాల్సిన హామీలను ఇందులో ప్రస్తావించనున్నారు. ఈ కమిటీ లో వెల్లంపల్లి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, మేరుగ నాగార్జున, మర్రి రాజశేఖర్, నాగిరెడ్డి, సంజీవ్ కుమార్, రంగయ్య , కిష్టప్ప, సుచరిత,నందిగం సురేష్,జంగా కృష్ణమూర్తి, తమ్మినేని సీతారాం, సజ్జల రామకృష్ణారెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరంతా సాద్యమైనంత త్వరగా సమావేశమై పార్టీకి మేనిఫెస్టో రూపకల్పన పై సూచనలు చేయాలని అదే విధంగా పాదయాత్ర సమయంలో తాను ఇచ్చిన హామీలను సైతం అందులో పొందు పర్చాలని జగన్ సూచించారు.












Click it and Unblock the Notifications