ప్రత్యేక రాయలసీమ: జగన్ పార్టీ ఎమ్మెల్యే వాదన

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాయలసీమ నాయకులు ముందుకు తెస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు డిమాండ్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు సాయిప్రసాద్ రెడ్డి మద్దతు పలికారు.

కర్నూలు జిల్లా ఆదోనీ పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్ట అధినేత జగన్మోహన్ రెడ్డి 26 నుంచి ఎపి ప్రత్యేక హోదా కోసం చేపట్టే నిరాహారదీక్షల వాల్‌పోస్టర్లను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడారు.

YCP MLA advocates for separate Rayalaseema

ప్రత్యేక హోదా రాకపోతే రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్నారు. రాయలసీమకు చెందిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ప్రధాని మోడీ ఏది చెబితే అందుకు బాబు తలూపుతున్నారని, రాయలసీమ కోసం పార్టీలకు అతీతంగా నాయకులు ముందుకు వచ్చి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+