రాజీనామా చేస్తా: జగన్ పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరి హెచ్చరిక
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు నిలిపేయకపోతే తాను శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాడేరు శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి చెప్పారు. బాక్సైట్ తవ్వకాల ప్రదేశాన్ని ఆమె సోమవారం సందర్శించారు. తన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని ఆమె చెప్పారు.
తనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఇతర నాయకులు గానీ పోటీ చేయవచ్చునని ఆమె అన్నారు. బాక్సైట్ మైనింగ్ ఎజెండాగా జరిగే ఎన్నికల్లో టిడిపి ఓడిపోతే చందర్బాబు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రభుత్వం బాక్సైట్ గనుల జోలికి రాకపోవడం మంచిదని ఈశ్వరి సూచించారు. ఈ పర్యటనలోో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంపై విశాఖపట్నం జిల్లాలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో అఖిల పక్షం తరఫున బంద్ కూడా జరిగింది. బాక్సైట్ తవ్వకాలను నిలిపేయకపోతే తమ పార్టీకి రాజీనామా చేస్తామని టిడిపికి చెందిన మణికుమారి, ఇతర నాయకులు కూడా ప్రకటించారు.












Click it and Unblock the Notifications