నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్ద నేతలు నా గొంతు కోసారు - ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలనం..!!

|
Google Oneindia TeluguNews

నెల్లూరు జిల్లా వైసీపీ నేతల సంచలనాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలతో సీఎం జగన్ ఆయన పైన కఠిన చర్యలు తీసుకున్నారు. ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని ఇంఛార్జ్ గా నియమించారు. ప్రభుత్వం ఆనం సెక్యూరిటీని తగ్గించింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేళ..ఇక నుంచి ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిన అవసరం లేదంటూ అధికారుల నుంచి ఆనంకు మెసేజ్ అందింది. దీని ద్వారా పరోక్షంగా ఆనం సేవలు ఇక చాలు..దయచేయండి అనే విధంగా జగన్ మార్క్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో సారి హాట్ టాపిక్ గా మారాయి.

కోటంరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు

కోటంరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు


ఆనంకు ముందు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో..ఆయనకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. నేరుగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కోటంరెడ్డితో మాట్లాడారు. అధికారులో సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఓపెన్ గా పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసారు. ఆ తరువాత కోటంరెడ్డి మౌనంగా తన పని తాను చేసుకు పోతున్నారు. తాజాగా.. పార్టీ సమావేశంలో మరోసారి కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదన్నారదు. సామాన్య కార్యకర్తగా పార్టీ జెండా మోసి రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేసారు. నా అనుకున్న వారి కోసం ఏం చేయటానికైనా వెనుకాడేది లేదన్నారు.

పెద్ద నేతల కుటుంబాలంటూ ఫైర్

పెద్ద నేతల కుటుంబాలంటూ ఫైర్


జిల్లాలో పెద్ద నేతల కుటుంబాలకు చెందిన వారు తన గొంతు కోశారని వ్యాఖ్యానించారు. తన రాజకీయ ఎదుగుదలకు ఆ కుటంబాలు అడ్డుకున్నాయని చెప్పుకొచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు అన్నీ తమకే కావాలని కోరుకొనే వారని చెప్పారు. వాళ్ల కుటుంబాలు, కుమారులు, బామ్మర్దులు, మనవళ్లు ..ఇలా అన్ని పదవులు జిల్లాలో ఆ కుటుంబాలకే దక్కాలని ప్రయత్నాలు చేసేవారంటూ కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. తాను కార్యకర్త స్థాయి నుంచి పని చేసిన వాడినని వివరించారు. తాను నమ్ముకున్న పార్టీ కోసం కేసులు భరించానని, లాఠీ దెబ్బలు తిన్నానని..లాకప్ లు చూసానని చెప్పారు. జిల్లాలో అటువంటి పెద్దల ఆటలు ఇక సాగవని కోటంరెడ్డి హెచ్చరించారు.

ఇక సాగవని వార్నింగ్

ఇక సాగవని వార్నింగ్


తాను వాళ్లలాగా రాజకీయాల కోసం ఆస్తులు పోగొట్టుకున్నానని చెప్పనని, తనకు తన తండ్రి వారసత్వంగా ఎటువంటి ఆస్తులు రాలేదని వివరించారు. ఈ వ్యాఖ్యలు సొంత పార్టీలో జిల్లాల పట్టు ఉన్న ఒక ప్రముఖ కుటుంబం పైనే చేసారనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు ఈ మధ్య కాలంలో ఓపెన్ గా చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పుడు కోటంరెడ్డి ఎవరి పేర్లు ప్రస్తావన చేయకపోయినా, ఎవరిని ఉద్దేశించి చేసారనేది మాత్రం రాజకీయంగా అవగాహన ఉన్నవారికి సులువుగానే అర్దం అవుతుందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..నెల్లూరు వైసీపీలో ముఖ్య నేతల తీరు చర్చకు కారణమవుతోంది.

English summary
YSRCP Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy sensational comments on District senior leaders politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X