సభలో వైసీపీ ఎమ్మెల్యే అల్టిమేటం: చర్చ పెట్టాలి..లేకుంటే రాజీనామా చేస్తా: అంగీకరించిన స్పీకర్..!
Recommended Video
శాసనసభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే సభా వేదికగా అల్టిమేటం ఇచ్చారు. తాను కోరుకుంటున్న చర్చను ఈ సమావేశాల్లోనే చర్చించాలని..లేకుంటే తాను ఎమ్మెల్యేల పదవి కి రాజీ నామా చేయటానికి సిద్దమని ప్రకటించారు. ప్రతిపక్ష నేతల తీరు..గతంలో చేసిన ఫిరాంయపుల పైన ఆ ఎమ్మెల్యే మండి పడ్డారు. దీంతో..స్పీకర్ స్పందించారు. ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసు పరిగణలోకి తీసుకుంటానని..ఈ అంశం పైన ఖచ్చితం గా చర్చించి..దేశానికి ఒక మంచి సందేశం ఇద్దామని హామీ ఇచ్చారు.
అధికార పార్టీ ఎమ్మల్యే అల్టిమేటం..
శాసనసభలో జీరో అవర్ కొనసాగుతుండగానే..పోలవరం పైన చర్చ కోసం టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ఆ సమయంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. సభలో ఇలా గందగరగోళం సృష్టిస్తూ మా లాంటి వాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. తాను గతంలో ఎమ్మెల్యేగా పని చేసానని..2014లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడానని వివరించారు. టీడీపీ చేసిన అక్ర మాలు..ఫిరాయింపులు చూడలేకనే తాను పార్టీ వీడానని చెప్పుకొచ్చారు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను నాడు టీడీపీ ఏ రకంగా ఫిరాయింపులకు పాల్పడిందో సభలో చర్చించాని..దీని ద్వారా విలువలు..న్యాయం గురించి మాట్లాడుతున్న టీడీపీకి సమాధానం చెప్పాలని రాంబాబు డిమాండ్ చేసారు. సభలో ఈ అంశం పైన చర్చ చేపట్టకుం టే తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని స్పష్టం చేసారు.

దేశానికే సందేశం ఇద్దాం..అంకురార్పణ చేద్దాం
తాను మాజీ ఎమ్మెల్యే హోదాలో ఏపీలో జరుగుతున్న ఫిరాయింపుల గురించి కోర్టుకు వెళ్లినా న్యాయం జరగలేదని ఆవే దన వ్యక్తం చేసారు.రాష్ట్రపతికి..ఎన్నికల సంఘానికి..స్పీకర్‌కు నివేదించినా ఫలితం రాలేదన్నారు. అదే సమయంలో న్యాయ పోరాటం చేసానని గుర్తు చేసారు. ప్రజల మనోభావాలు గుర్తించి ..ఫిరాయింపులకు పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడేలా చూడాలని ఎమ్మెల్యే రాంబాబు కోరారు. దీనికి స్పీకర్ తమ్మినేని సైతం అంగీకరించారు. రాంబాబు ఇచ్చిన ఈ నోటీసు మీద చర్చించి..సభలో ఖచ్చితంగా చర్చ చేద్దామని స్పష్టం చేసారు. ఏపీలో జరిగే చర్చ ద్వారా ఇచ్చే సందేశం ఇప్పుడు దేశం మొత్తానికి అవసరమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్చలు..చర్యలు అవసరమని స్పీకర్ చెప్పుకొ చ్చారు. ఇటువంటి చర్చలు..చర్యలకు ఏపీ శాసనసభలోనే అంకురార్పణ చేద్దామంటూ స్పీకర్ ప్రతిపాదించారు. దీని మీద తాను ముఖ్యమంత్రితోనూ చర్చిస్తానని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications