రోజా సంచలనం:త్వరలో వైఎస్ఆర్ అన్న క్యాంటీన్లు ఏర్పాటు
చిత్తూరు:వైసిపి ఎమ్మెల్యే రోజా మరో సంచలన ప్రకటన చేశారు. తన నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్‌ఆర్ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు.
వాటిని తాను సొంతంగా ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే రోజా చెప్పారు. సోమవారం నగరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. టిడిపి ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అభివృద్ధి పనుల కోసం ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. దీంతో ప్రజల కోసం సహాయ కార్యక్రమాలను తానే సొంతగా చేపడుతున్నానన్నారు.

నగరి ప్రభుత్వాస్పత్రిలో, హాస్టళ్ళలో, బాలికల జూనియర్ కాలేజీలో ఆర్‌వో ప్లాంట్లు, కూలర్లు ఏర్పాటు చేశామని...10 మంది చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు అందచేశానని ఆమె చెప్పారు. ఆకలితో బాధపడే వారికి కడుపు నిండా అన్నం పెట్టాలనే దృక్పథంతో త్వరలో వైఎస్ఆర్ అన్న క్యాంటీన్లను కూడా ఏర్పాటు చేస్తానన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ది పరంగా నగరి నియోజకవర్గం రూపురేఖలు మారుతాయని ఆమె హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications