సీమకు హైకోర్టు: శ్రీకాంత్, జగన్‌కు యనమల కౌంటర్

హైదరాబాద్: హైదరాబాద్‌ మాదిరిగా అభివృద్ధి కేంద్రీకరణ వద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, లేకపోతే లాయర్లతో ఆందోళన చేస్తామని చెప్పారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నారు.

సభలో జగన్ ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. 40 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని కోరితే వాటిని 17రోజుకే కుదించాలని ప్రభుత్వం చూస్తోందని, తమకు ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని జగన్ ఆరోపించారు. అధికార పక్షం ఈ విధంగా వ్యవహరిస్తే తాము ఇంకెవరికి చెప్పుకోవాలన్నారు.

Srikanth Reddy

దీనిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత తిరిగి చర్చ సరికాదన్నారు. నిబంధనల ప్రకారం వస్తే ఎలాంటి సమస్యపై అయినా చర్చకు తాము సిద్ధమన్నారు. సభలో సభ్యుల సంఖ్య ఆధారంగా మాట్లాడేందుకు తగిన సమయం కేటాయిస్తామని చెప్పారు. రైతు సమస్యల పైన చర్చకు సిద్ధమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+