పవన్ ఎప్పుడు ఎవరికి తాళి కడతారో అంటూ ... వ్యక్తిగత విమర్శలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు తాజాగా వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అయితే ఆయన రాజకీయ అంశాలను మాత్రమే కాకుండా పవన్ వ్యక్తిగత అంశాలను టార్గెట్ చేసి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరికి తాళి కడతారో , ఎప్పుడు ఎవర్ని ఎగతాళి చేస్తారో తెలీదని ఆయన వ్యక్తిగత విమర్శలకు దిగారు. వైసీపీకి వ్యతిరేకంగా ఎల్లో మీడియా రాసిన వార్తలను పట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ తన నట విశ్వ సరూపాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ అధ్యక్షుడుగా ఓడిపోయిన వ్యక్తి పవన్ అని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు. సొంత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా వ్యవహరిస్తున్న పవన్ టీడీపీకి దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సొంత పుత్రుడు నారా లోకేశ్ పనికిరాడని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ తో రాజకీయాలు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఓటమి పాలైనా పవన్ సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు .

YCP MLA Sudhakar Babu personal attack on Janasena chief Pawan kalyan

పవన్ పుస్తకాల మాట దేవుడెరుగు కానీ ప్రతి నిత్యం ఎల్లో మీడియా , మరియు చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్స్ చదువుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు.వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం అంటే పవన్ కు చాలా భయమని పేర్కొన్న ఎమ్మెల్యే సుధాకర్ బాబు అందుకే పవన్ వై ఎస్ జగన్ మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని వ్యాఖ్యానించారు. వవన్ కళ్యాణ్ దీక్షలో టీడీపీ నేతలు ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు.

ఇసుకపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు టీడీపీ హయాంలో ఇసుక దోపిడీ జరిగిన విషయాన్ని మర్చిపోయారన్నారు. పవన్ ఒక చేతిలో తాళి , మరో చేతిలో ఎగతాళి ఉంటాయని ఎప్పుడు ఎవరికి తాళి కడతారో, ఎప్పుడు ఎవర్ని ఎగతాళి చేస్తారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ఇంతకాలం చంద్రబాబు విష కౌగిలిలో ఉన్న పవన్ ఇప్పటికి అయినా బయటకు రావాలని ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+