వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే ఓటుకు ఎస‌రు : ఏపిలో 8.72 లక్ష‌ల ఫారం-7లు : ఎవ‌రికి న‌ష్టం క‌లిగేను..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో ఓట్ల తొలిగింపు ద‌ర‌ఖాస్తుల వ్య‌వ‌హారం తారా స్థాయి కి చేరింది. ఓట‌ర్ల‌కు తెలియ‌కుండానే వారి ఓట్ల తొలిగింపు ద‌ర‌ఖాస్తులు ఎన్నిక‌ల సంఘానికి చేరుతున్నాయి. ఏపిలో ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌స్తుతం 8.72 ల‌క్ష‌ల ఫారం-7 ద‌ర‌ఖా స్తులు పెండింగ్ లో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వైయ‌స్ వివేకానంద‌రెడ్డి ఓటు తొలిగింపుకు ద‌ర‌ఖాస్తు రాగా..ఇప్పుడు ఏకంగా ఓ ఎమ్మెల్యే ఓటు తొలిగింపు కోసం ద‌ర‌ఖాస్తు చేసారు.

<strong>రోజా పై టిడిపి అభ్య‌ర్ది ఎవ‌రు : అసెంబ్లీలో కాలు పెట్ట‌కూడ‌దు : చ‌ంద్ర‌బాబు నిర్ణ‌యం..!</strong>రోజా పై టిడిపి అభ్య‌ర్ది ఎవ‌రు : అసెంబ్లీలో కాలు పెట్ట‌కూడ‌దు : చ‌ంద్ర‌బాబు నిర్ణ‌యం..!

ఓట్ల తొలిగింపుకు కుట్ర‌లు

ఓట్ల తొలిగింపుకు కుట్ర‌లు

ఏపిలో ఎన్నిక‌లు స‌మీపిస్తు్న్న వేళ రాజ‌కీయంగా కొత్త కుట్ర‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ఓట్ల తొలిగింపు కోసం ల‌క్ష‌లా ది ద‌ర‌ఖాస్తులు ఎన్నిక‌ల సంఘానికి చేరుతున్నాయి. ప్ర‌త్య‌ర్ధి పార్టీల ఓట్లు ల‌క్ష్యంగా రాజ‌కీయ పార్టీలు ఓట్ల తొలిగింపు లో కొన్ని ప‌క్షాల ప్ర‌మేయం ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 8.72 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో 90 శాతం గత పది రోజుల వ్యవధిలో ఆన్‌లైన్‌లో వచ్చినవే. గుంటూరు జిల్లాలో 1.17 లక్షలు, చిత్తూరులో 1.09 లక్షల మంది పేరిట ఈ ముఠా ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేశారంటే ఇది ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతుంది. ఇన్ని లక్షల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించటం చాలా కష్టసాధ్యం. ఈ క్రమంలో అర్హుల ఓట్లు గల్లంతై, అనర్హుల ఓట్లు జాబితాలో మిగిలిపోయే ప్రమాదం ఉంది.

ఎమ్మెల్యే ఓటుకు ఎస‌రు..!

ఎమ్మెల్యే ఓటుకు ఎస‌రు..!

కొద్ది రోజుల క్రితం క‌డ‌ప జిల్లా పులివెందుల లో వైయ‌స్ వివేకానంద రెడ్డి ఓటు తొలిగించాలంటూ ద‌ర‌ఖాస్తు వ‌చ్చింది. దీని పై స్థానిక అధికారులు వివేకానంద రెడ్డిని ఆరా తీసారు. దీని పై వివేకానంద రెడ్డి తాను ద‌ర‌ఖాస్తు చేయ‌లేద‌ని చె బుతూ..త‌ప్పుడు ద‌ర‌ఖాస్తు చేసిన వారి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిర్యాదు చేసారు. ఇప్పుడు ఏకంగా ఓ ఎమ్మెల్యే ఓటు నే తొలిగించాల‌ని ద‌ర‌ఖాస్తు రావ‌టంతో అధికారులు విస్తుపోతున్నారు. వైఎస్సార్‌సీపీ పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఓటుకు ఎసరు పెట్టింది. తన ఓటు తొలగింపునకు దరఖాస్తు వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోయారని సునీల్‌కుమార్‌ అన్నారు. స్థానిక త‌మ‌సీల్దార్ దీని పై ఎమ్మెల్యేను సంప్ర‌దించారు. తాను ఎటువంటి ద‌ర‌ఖాస్తు చేయ‌లే ద‌ని..దీని పై ఫిర్యాదు చేస్తాన‌ని ఎమ్మెల్యే స్ప‌ష్టం చేసారు.

ప‌రిశీల‌న సాద్య‌మేనా..!

ప‌రిశీల‌న సాద్య‌మేనా..!

ఓట్ల నమోదు, తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తుల కేత్రస్థాయి పరిశీలన ఈ నెల 7లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం గడువు నిర్దేశించింది. అయితే కొంతమంది వ్యక్తులు దురుద్దేశపూరితంగా భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపు దరఖాస్తులు పెడుతుండటంతో వాటి పరిశీలన పెద్ద సమస్యగా మారింది. ఒక్క గుంటూరు జిల్లా నుంచే ఇలాంటివి 1.17 లక్షల దరఖాస్తులు అందాయి. చిత్తూరు జిల్లాలో 1.09 లక్షలు, విశాఖపట్నం జిల్లా నుంచి 78,848 దరఖాస్తులు వచ్చాయి. మిగతా జిల్లాల్లో ఇదే పరిస్థితి. వీటిలో అత్యధికం గత వారం రోజుల్లో అందినవే. వీటిలో బోగస్‌ ఆక్షేపణలు, రాజకీయ దురుద్దేశంతో చేసిన దరఖాస్తులే అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే మ‌రో రెండు రోజుల్లో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లయ్యే అవ‌కాశం ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించి ప‌రిష్క‌రించే ప‌రిస్థితి పై సందేహాలు మొద‌ల‌య్యాయి.

English summary
Votes deletion application is in Huge in AP. YCP Mla sunil vote deletion application came to election commission. But Mla surprised and informed that he did not applied for his vote deletion. In Ap approximately 8.72 Lakhs form -7 applications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X