కుక్కను, గాడిదను పెట్టా, ఓటేయాలంటే ఎలా: జగన్‌పై జలీల్ ఖాన్ సంచలనం

విజయవాడ: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులపై తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థిని నిలపాల్సిన పరిస్థితి గురించి ఆయన వివరించే ప్రయత్నం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను బంధించి ఉంచారని ఆయన ఆరోపించారు.

రాజ్యసభ ఎన్నికల్లో విజయసాయి రెడ్డికి ఓటు వేయడానికి వైసిపి ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరని ఆయన అన్నారు. వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన శాసనసభ్యులతో సోమవారంనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడారు.

జగన్‌తో బంధుత్వం ఉన్నవాళ్లే టిడిపిలోకి ఎక్కువ మంది వచ్చారని ఆయన అన్నారు. నామినేషన్లు వేసిన తర్వాత ఏమవుతుందో చూడండని ఆయన మీడియాతో అన్నారు. జగన్‌పై ఎన్ని కేసులున్నాయో విజయసాయి రెడ్డిపై కూడా అన్ని కేసులున్నాయని ఆయన అన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా ప్రజలకు సేవ చేసేవారు కావాలని, అది విజయసాయిరెడ్డికి తెలియదని ఆయన అన్నారు.

 Zaleel Khan

ప్రజా జీవితం వేరు, చదువుకోవడం వేరని, విజయసాయి రెడ్డికి ప్రజా జీవితంలో అనుభవం లేదని అన్నారు. ఎమ్మెల్యేలు జగన్ గులామ్‌లా అని అడిగారు. వారికి కూడా స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని, రేపు ఇద్దరు తమ పార్టీలో చేరుతారని, తర్వాత మరింత మంది వస్తారని ఆయన అన్నారు. అది మీరే చూస్తారని అన్నారు.

కుక్కను, గాడిదను, ఏనుగును పోటీకి పెట్టా, ఓటేయాలని ఎమ్మెల్యేలను అడిగితే ఎలా అని ఆయన అడిగారు. వైసిపి ఎమ్మెల్యేలంతా అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు. టిడిపి నాలుగో అభ్యర్థిని పోటీకిి దించితే ఎంత మంది మద్దతు ఉంటుందనే విషయంపై తాము చర్చిస్తున్నట్లు తెలిపారు.

రాజ్యసభకు ఎన్నిక కావడానికి ఎంత మంది ఎమ్మెల్యేలు కావాలని ఆయన మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్న వేశారు. కేసుల గురించి జగన్‌కు చాలా తెలుసునని ఆయన అన్నారు. జగన్‌పై ఉన్నటువంటి కేసులు తమపై లేవని, వాటిని తాము ఎదుర్కుంటామని చెప్పారు. వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తే తాము కాదనమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+