కాల్ మనీపై చంద్రబాబును ఏకేసిన చెవిరెడ్డి, ఉప్పులేటి కల్పన
హైదరాబాద్: కాల్ మనీ వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉప్పలేటి కల్పన, తిప్పారెడ్డి, తదితరులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని ఏకేశారు. శాసనసభ పది నిమిషాలు వాయిదా పడిన తర్వాత వారు గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు తప్పు చేసినవారిని శిక్షించకుండా తమపై అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు తమపై ఆరోపణలు చేస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ బీహార్‌ను మించిపోతోందని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆయన అన్నారు. ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని ఆయన అననారు. మహిళలను అవమానపరుస్తూ, వారిని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు.

మహిళలు రోడ్లపై తిరగలేని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుశ్సాసన పాలన సాగుతోందని, రాష్ట్రాన్ని అఫ్గనిస్తాన్‌లా తయారు చేస్తున్నారని ఆయన అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేతో సంబంధం ఉన్న కాల్ మనీ నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్ ఎలా పారిపోతాడని ఎమ్మెల్యే తిప్పారెడ్డి ప్రశ్నిస్తున్నారు. కాల్ మనీ పేర ప్రజలను జలగల్లా పీడిస్తున్నారని ఆయన అన్నారు.
కాల్ మనీ వ్యవహారంలో వడ్డీ వ్యాపారాలు మహిళలను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, చంద్రబాబు గత 12 నెలలుగా విజయవాడలో ఉంటూ కూడా ఈ విషయంపై దృష్టి సారించలేదని శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన అన్నారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆమె అన్నారు. దురాగతాలన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
ఓ మహిళ తన భర్తతో కలిసి వచ్చి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని, అప్పుడే చంద్రబాబు చర్య తీసుకుని ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని, కానీ చంద్రబాబు పట్టించుకోలేదని ఆమె అన్నారు. వైసిపి నాయకులు కూడా కాల్ మనీ వ్యాపారంలో ఉన్నారని చెబుతూ అధికార తెలుగుదేశం పార్టీ కేసులను తప్పు దారి పట్టించే ప్రయత్నాలు చేస్తోందని ఆమె విమర్శించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంలో పీకల్లోతు మునిగిన టిడిపి పార్టీ నాయకులు ఆ బురదను ప్రతిపక్షాలకు కూడా రుద్దాలని చూస్తున్నారని ఆమె అన్నారు.
చిన్న పాటి వడ్డీ వ్యాపారులను, తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చేవారిని పట్టుకుని వైసిపి నాయకులు కూడా కాల్ మనీ వ్యవహారంలో ఉన్నారని చెబుతున్నారని ఆమె అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications