వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొంప‌లో కూర్చొని పాల‌న చేస్తారా ?.. జ‌గ‌న్ ఢిల్లీ పర్యటన రహస్యం ఇదే.. సీఎంపై ర‌ఘ‌రామ‌కృష్ణ‌మ రాజు సెటైర్లు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ రఘరామ కృష్ణమ రాజు . కనీసం సచివాలయాలనికి కూడా రాకుండా.. ఇంట్లో కూర్చోని పాలన చేసే ముఖ్యమంత్రి ఏపీలో తప్ప మరెక్కడా లేరని విమర్శించారు. ప్రధాని మోదీతో తన విషయంతో పాటు ఆయన బెయిల్ గురించి కూడా మాట్లాడ‌తారి ఆరోపించారు. రాష్ట్రాంలో పాలనను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. పేద‌ల‌పై ప‌న్నులు వేసి ప‌బ్బం గ‌డుపుకుంటున్నార‌ని ఆరోపించారు.

Recommended Video

Raghu Rama Krishnam Raju పై పోలీసుల దాడి... షుగర్ వల్లే కాళ్లు అలా అంటూ YCP || Oneindia Telugu
ప్ర‌ధాని మోదీతో సీఎం జ‌గ‌న్ చ‌ర్చ‌లు ఇవే..

ప్ర‌ధాని మోదీతో సీఎం జ‌గ‌న్ చ‌ర్చ‌లు ఇవే..

ఢిల్లీలో సీఎం జగన్ పర్యటనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆపార్టీ ఎంపీ రఘురామ కృష్ణమరాజు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయిన తర్వాత సీఎం జగన్ కీలక అంశాలు ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు. పోలవరంపై చర్చించామని చెబుతారని చెప్పారు. తనకు ఉన్న సమాచారం మేరకు ప్రధానితో తన విషయంతో పాటు ఆయన బెయిల్ అంశంపై కూడా చ‌ర్చిస్తార‌ని పేర్కొన్నారు. సొంత విష‌యాలు కాకుండా ప్రధానితో రాష్ట్ర సమస్యలపై చర్చిస్తే బాటుంటుందని రఘురామకృష్ణమ రాజు సెటైర్లు వేశారు..

 వివేకా హత్య‌కేసుపై కూడా..?

వివేకా హత్య‌కేసుపై కూడా..?

ప్రధాని మోదీతో కడప వ్యవహారాలపై కూడా చర్చించే అవకాశం లేకపోలేదన్న అనుమానాన్ని రఘురామకృష్ణమరాజు వ్యక్తం చేశారు . మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తారని కథనాలు వస్తున్నాయన్నారు. గతంలో ఆలయాలకు ధార్మిక సంస్థలు ఉండేవి. కానీ ఇప్పుడు లేవని చెప్పారు. విగ్రహాలపై దాడులు చేసిన వారిని పోలీసులు పట్టుకోవడం లేదని మండిపడ్డారు. పోలీసులు వైసీపీ నేత‌లు చెప్పిన‌ట్టే వ్య‌వ‌హారిస్తున్నార‌ని విమ‌ర్శించారు. కొంప‌లో కూర్చోని సీఎం జ‌గ‌న్ పాల‌న సాగిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఇప్ప‌టికైనా స‌చివాల‌యానికి వ‌చ్చి ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను విని వాటిని పరిష్క‌రించాల‌ని ర‌ఘు రామ‌కృష్ణ‌మ‌రాజు కోరారు.

 పేద‌ల‌పై ప‌న్ను పోటు

పేద‌ల‌పై ప‌న్ను పోటు

సీఎం జగన్‌ బెయిల్ పిటిషన్‌ ఎందుకు ఆలస్యం అవుతుందో దేవుడికే తెలియాలన్నారు. కోర్టు అంశాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని ర‌ఘ‌రామ‌కృష్ణ‌మ రాజు పేర్కొన్నారు. పేదల ఇళ్లపై రాష్ట్ర‌ ప్రభుత్వం ఇష్టానుసారంగా పన్నులు విధిస్తోందని మండిపడ్డారు. కట్టని వారిని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో చెత్తకు పన్ను, కట్టుకున్న బాత్ రూంకు పన్ను వేస్తూ పేదల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. సినిమా టిక్కెట్ల ధరలపై సీఎం జగన్ వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టాలని నాడు ఎన్టీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కానీ నేడు సీఎం జగన్ మాత్రం పేదల కోసం సినిమా టికెట్ ధరలు తగ్గించామంటున్నారు అని ర‌ఘురామ కృష్ణ‌మ రావు విమర్శించారు.

English summary
YCP MP Raghurama krishnam raju slams on CM Jagan Delhi Tour
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X