బాబూ గారూ.. మీకు ప్రజలు శాశ్వతంగా చెక్ పెడతారు: విజయసాయిరెడ్డి..
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీరు మారడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం చేసే ప్రతీ పనిని విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. అధికారం కోల్పోయాక ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీరు చేయని పనులు.. తాము చేస్తున్నామని తెలిపారు.
ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని విజయసాయిరెడ్డి చెప్పారు. ఏ పథకం ప్రవేశా పెట్టినా అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ఇదీ చంద్రబాబుకు వృథా ప్రయాస అని పేర్కొన్నారు.

సీఎం జగన్ సంకల్పం ముందు బాబు ఆటంకాలేవీ పని చేయవని స్పష్టంచేశారు. ఇలాగే చేస్తూ పోతే ప్రజలు మీకు శాశ్వతంగా చెక్ పెడతారని జోస్యం చెప్పారు. మీకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తారని ధ్వజమెత్తారు.
Recommended Video
ఏ పథకం ప్రవేశపెట్టినా శోకాలు పెడుతూ అడ్డుకోవాలని చూస్తున్నాడు బాబు. సిఎం జగన్ గారి సంకల్పం ముందు ఈయన ఆటంకాలేవీ పనిచేయవు. ఇలాగే చేస్తూ పోతే ప్రజలు మీకు శాశ్వతంగా చెక్ పెట్టి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 14, 2020
ఇటీవల విశాఖ కంటకుడు పేరుతో 10 పార్ట్‌ల వరకు సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. గత 10 ఏళ్లలో విశాఖపట్టణానికి చంద్రబాబు చేసిన నష్టాన్ని వివరించారు. దివంగత సీఎం వైఎస్ఆర్, జగన్ చేస్తున్న మంచి పనులను చెబుతున్నారు.
హుద్ హుద్ తుపాన్ సమయంలో పెద్ద బస్సు వేసుకొని వచ్చి.. సహాయ కార్యక్రమాలకు అడ్డుపడ్డారని విమర్శించారు. పైగా.. తాను పనిచేసినట్టు బిల్డప్ ఇచ్చారని మండిపడ్డారు. గత ఐదేళ్ల పాలనలోనే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలో విశాఖపట్టణానికి ఏమీ చేయలేదని ఫైరయ్యారు. కానీ మంచి పాలన అందిస్తోన్న జగన్‌ను విమర్శించడం సరికాదు అని.. తీరు మార్చుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications