టీడీపీ ఇల్లీగల్ ఓటరు ప్రొఫైలింగ్ చేస్తోంది; జనసేన ఒక పార్టీనా?: విజయసాయి రెడ్డి

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏపీలో పర్యటిస్తున్నారు. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని అత్యున్నత బృందం నిన్న రాత్రి విజయవాడకు చేరుకుంది. ఎన్నికల సన్నద్ధత గురించి అధికారులతో వీరు సమీక్షలు నిర్వహించనున్నారు.

ఓటర్ల జాబితాకు సంబంధించి వివిధ పార్టీలు చేసిన ఫిర్యాదులపై విచారణ నిర్వహించనున్నారు. అలాగే ప్రతి రాజకీయ పార్టీతో వీరు భేటీ అవుతున్నారు. ఒక్కో పార్టీతో 15 నుంచి 20 నిమిషాల పాటు వీరు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో నొవోటెల్ హోటల్ లో సీఈసీ అధికారులతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీకి వీరు వివరించనున్నారు. భేటీ అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ వైసిపి నేతలు దొంగ ఓట్లు చేరిక పై పిర్యాదు చేసినట్లు తెలిపారు.

ycp mp vijayasai reddy complaint on tdp and janasena to election commission officials

కాగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి తెలుగుదేశం పార్టీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైల్ చేస్తుందని ఆయన వారికి ఫిర్యాదు చేశారు. జనసేన గుర్తింపు లేని పార్టీ అని, ఇక ఆ పార్టీని ఎలా అనుమతిస్తున్నారని ఎన్నికల కమిషన్ ను తాము ప్రశ్నించినట్టుగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో ఓటర్లుగా నమోదైన వారంతా ఇక్కడ కూడా ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, వారు రెండు చోట్ల ఓట్లు వేయకుండా నిరోధించాలని తాము ఎన్నికల కమిషన్ ను కోరామని విజయ సాయి రెడ్డి తెలిపారు. 6 అంశాలపై తాము సీఈసీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారని, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళామని ఆయన తెలిపారు.

ఎక్కడ బోగస్ ఓట్లు లేవని జిల్లా కలెక్టర్లు ఓటర్ల జాబితా పై ఈసీకి రిపోర్ట్ ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పేరుతో ఒక వెబ్సైట్ పెట్టి తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలను, ఏపీలో శాసనసభ, పార్లమెంటు ఎన్నికలను ఒకే ఫేజ్ లో పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు తాము విజ్ఞప్తి చేశామని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+