మీసం మెలేసిన పోలీస్ మాధవ్‌కు తొలిజాబితాలో చోటిచ్చిన వైసీపీ
హైదరాబాదు: శనివారం పులివెందులలో తన చిన్నాన్న వివేకానందరెడ్డి అంత్యక్రియలకు హాజరై హైదరాబాదు చేరుకున్న వైసీపీ అధినేత జగన్... తమ లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి కసరత్తు చేసి తొలి జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు, మూహుర్తం బాగుందని చెప్పడంతో ముందుగా 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నట్లు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు ఇడుపులపాయలోని వైయస్ ఘాట్‌కు వెళ్లి తన తండ్రి వైయస్‌కు నివాళులు అర్పించి మిగతా లోక్‌సభ అభ్యర్థుల పేర్లు... 175 నియోజకవర్గాలకు చెందిన క్యాండిడేట్ల పేర్లను జగన్ ప్రకటించనున్నట్లు వేమిరెడ్డి తెలిపారు.

నాడు సీఐగా పనిచేసి రాజీనామా చేసిన గోరంట్ల మాధవ్‌కు హిందూపురం నుంచి టికెట్ కేటాయించగా... కర్నూలు లోక్‌సభను డాక్టర్ సంజీవ్ కుమార్‌కు కేటాయించారు. ఇక బాపట్ల నియోజకవర్గం నుంచి సాధారణ వ్యక్తి నందిగం సురేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు వైయస్ జగన్. ఇక తొలి జాబితాలో స్థానం దక్కించుకున్న అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి.
1. కడప- వైయస్ అవినాష్ రెడ్డి
2. అరకు - గొడ్డేటి మాధవి
3. అనంతపురం - తలారి రంగయ్య
4. అమలాపురం- చింత అనురాద
5. బాపట్ల - నందిగామ సురేష్
6. కర్నూలు - డాక్టర్ సంజీవ్ కుమార్
7. హిందూపురం - గోరంట్ల మాధవ్
8. రాజంపేట - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
9. చిత్తూరు - నల్లకొండాగారి రెడ్డప్ప












Click it and Unblock the Notifications