విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన వైసీపీ

వైసీపీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.తాను క్రియశీల రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమవుతున్నట్లు ఆయనప్రకటించారు.రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. జగన్ బాగుండాలని కోరుకుంటూనే..తాను ఏ పార్టీలో చేరటం లేదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా తీసుకుంటున్న నిర్ణయంగా పేర్కొన్నారు. తాను భవిష్యత్‌లో వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు.

శనివారం ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం, ఉప రాష్ట్రపతి విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదించడం అన్నీ కూడా చక చక జరిగిపోయాయి. విజయసాయిరెడ్డి రాజీనామాపై పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.జగన్ లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే విజయసాయిరెడ్డి ఇంత సడన్‌గా ఎందుకు రాజీనామా చేశారనే విషయం మాత్రం తెలియడం లేదు. ఇటీవలే ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా స్వీకరించారు.ఇలాంటి సమయంలో ఆయన జగన్‌కు తోడుగా ఉండాల్సిబోయి, ఇలా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటని వైసీపీ శ్రేణులు ఆయన్ను ప్రశ్నిస్తున్నాయి.

YCP responds to Vijayasai Reddy resignation

తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ అధికారికంగా స్పందించింది. "మీ నిర్ణయాన్ని మేము ఆమోదించకపోయినా, మీ ఎంపికను మేము ఇప్పటికీ గౌరవిస్తాము. మా పార్టీ ఆవిర్భావం నుండి మీరు మా పార్టీకి బలమైన మూలస్తంభాలలో ఒకరిగా ఉన్నారు. కష్టాలు, విజయాలు రెండింటిలోనూ మీరు మాతో నిలబడే ఉన్నారు. ఇప్పుడు పార్టీ నుండి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము.వ్యవసాయ రంగంలో మీ అభిరుచిని కొనసాగించడానికి రాజకీయాల నుండి వైదొలగాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము. మీ సహకారాలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. భవిష్యత్తులో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము'' అని వైసీపీ ట్వీట్‌ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+