'SEIZE THE ROAD'పవన్ కల్యాణ్‌కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిధిగా వెళ్లారు. అయితే ఈ కార్యక్రమం నుంచి తిరిగి వెళుతూ ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పవన్ కల్యాణ్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆ ఇద్దరు మరణించారని పవన్ ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నీతులు చెప్పడం వరకేనని, ఆచరణ ఉండదని విమర్శించారు. గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని శ్యామల ఎద్దేవా చేశారు.కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్‌కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సర్ SEIZE THE ROAD... అనాలి కదా? అంటూ ఆమె పవన్ కల్యాణ్‌కు కౌంటరిచ్చారు.

సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈలలు వేసి గోల చేయండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా అని ఆమె పవన్‌ను ప్రశ్నించారు.మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్లి పరామర్శించారా?... అంటే, మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా?" అంటూ శ్యామల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications