వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా కు వైసీపీ - టీడీపీ ఎంపీల ఫిర్యాదులు : పోటాపోటీగా : చంద్రబాబు అప్పాయింట్ మెంట్ పైనా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామల నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదులు చేసేందుకు టీడీపీ..వైసీపీ ఎంపీలు పోటీ పడుతున్నారు. తీర ప్రాంత భద్రత పైన అమిత్ షా సమావేశం ఏర్పాటు చేసారు. పార్లమెంట్ కమిటీ హాల్ లో జరిగిన ఈ సమావేం ముగిసిన తరువాత ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. అమిత్ షా కమిటీ సభ్యులతో మాట్లాడుతూ పార్లమెంట్ లాబీల్లోకి వచ్చారు. ఆ సమయంలో అమిత్ షా తో మాట్లాడేందుకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర ప్రయత్నించారు.

పార్లమెంట్ ప్రాంగణంలో ఫిర్యాదులు

పార్లమెంట్ ప్రాంగణంలో ఫిర్యాదులు


ఇంతలో అమిత్ షా ను కలిసి వైసీపీ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ అప్పటికే తాను సిద్దం చేసుకున్న ఒక వితని పత్రాన్ని కేంద్ర హోం మంత్రికి అందించారు. అది ఆయన వెంటనే చదువుతూ తన వ్యక్తిగత సిబ్బందికి ఇచ్చారు. అదే సమయంలో కనకమేడల పైతం అమిత్ షా తో చంద్రబాబు అప్పాయింట్ మెంట్ గురించి ప్రస్తావించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉద్దేశాన్ని అమిత్‌షాకు కనకమేడల వివరించారు. త్వరలోనే చంద్రబాబుకు అపాయింట్‌మెంట్‌ ఇస్తానని అమిత్‌షా తెలిపారు. ఏపీలో పరిస్థితులపై అమిత్‌షా ఆరా తీశారు.

ఎంపీ మాధవ్ వినతి పత్రం

ఎంపీ మాధవ్ వినతి పత్రం

తాను ముఖ్యమంత్రి జగన్ పైన టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను వివరిస్తూ అమిత్ షా కు ఫిర్యాదు చేసినట్లుగా ఎంపీ మాధవ్ చెప్పుకొచ్చారు. వారి పైన చర్యలు తీసుకోవాలని కోరారు. అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం టీడీపీ నేతలు మోకరిల్లుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను చేసిన ఫిర్యాదును పరిశీలిస్తానని హోం మంత్రి హామీ ఇచ్చినట్లు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించారు. టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు గవర్నర్ తో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు.

చంద్రబాబు అప్పాయింట్ మెంట్ కోసం

చంద్రబాబు అప్పాయింట్ మెంట్ కోసం

తమ పార్టీ కార్యాలయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. ఇక, ఢిల్లీ పర్యటనలో రాష్ట్రపతితో పాటుగా ప్రధాని..కేంద్ర హోం మంత్రిని కలవాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, రాష్ట్రపతిని మాత్రమే కలిసారు. జమ్ము కాశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ షా అప్పాయింట్ మెంట్ దక్కలేదు. దీంతో..బుధవారం కేంద్ర హోం మంత్రి టీడీపీ అధినేతకు ఫోన్ చేసి వాకబు చేసారు. ఆ సమయంలో రాష్ట్రంలో పరిస్థితులను చంద్రబాబు వివరించారు. జగన్ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసారు. త్వరలోనే అమిత్ షా తో నేరుగా సమావేశమయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఇందు కోసం ఢిల్లీలోని టీడీపీ ఎంపీలు సైతం ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతో..టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయాలు ఢిల్లీ కేంద్రం గా ఊపందుకున్నాయి.

English summary
TDP and YCP MP's complaint to Union home minister Amith Shah on each other. TDP asekd Appaointement for Chandra Babu once again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X