వైసీపీ చేతికి చిక్కిన మరో వీడియో..!
గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 151 స్థానాలతో అధికారంలో ఉన్న వైసీపీ గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జగన్ దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూనే అధికారపక్షానికి ఆయన చెక్ పెడుతున్నారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో అధికారపక్షం కన్నా వేగంగా స్పందించారు. ఇంకా చెప్పాలంటే తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేయడంతో పాటు, పార్టీ నేతలతో ప్రమాణం చేయించడం, సీజేఐ, ప్రధాని మోదీకి లేఖ రాయడంతో ఈ విషయంలో అధికార పార్టీ కన్నా జగన్ వేగంగా పావులు కదిపినట్టు అయింది.
వైసీపీ చేతికి చిక్కిన మరో వీడియో..!!#Anitha #Chandrababu #CMChandrababu #YSJagan #Oneindiatelugu pic.twitter.com/cBFegDM8qr
— oneindiatelugu (@oneindiatelugu) October 5, 2024
ఇక జగన్ డిక్లరేషన్‌పై కూడా పెద్ద వివాదమే చేలరేగింది. డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ శ్రీవారిని దర్శించకోవడానికి వీల్లేదని కూటమి నేతలు డిమాండ్ చేశారు. అయితే తన డిక్లరేషన్ కారణంగా లడ్డూ వివాదం పక్క దారి పట్టకూడదనే ఉద్దేశంతో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంతో కూటమి నేతలు ఆయపై తీవ్ర విమర్శించారు. హోంమంత్రి అనిత ఓ అడుగు ముందుకేసి జగన్ తాను హిందువనని చెప్పుకోలేరని, ఆయన తిరుమల లడ్డూ ఎప్పుడైనా తిన్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూజ సమయంలో ఆయన తన తలపై వేసిన అక్షింతలను సైతం తన చేతితో దూలుపుకున్నారని ఆమె ఎద్దెవా చేశారు.

అయితే తాజాగా తిరుమల ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సమయంలో వేద పండితులు చంద్రబాబును ఆశీర్వదిస్తూ అక్షింతలు వేయగా, ఆయన తలపై వేసిన అక్షింతలను దూలుపుకున్న వీడియోను వైసీపీ తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గతంలో హోం మంత్రి అనిత మాట్లాడిన మాటలకు ఈ వీడియోను జత చేసి వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది.హోం మంత్రి అనితకు కౌంటర్‌గానే వైసీపీ ఈ వీడియోను రిలీజ్ చేసినట్టు స్పష్టం అవుతోంది.మరి దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications