కేంద్రంలో బీజేపీ , ఏపీలో వైసీపీదే హవా ...వైసీపీ 110 స్థానాల్లో విజయం .. బీజేపీ నేత మురళీధర్ రావు

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు బీజేపీ నేతలు . నిన్నటికి నిన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చంద్రబాబుకు ఓటమి ఖాయమని చెప్పి, ఓటమి భయంతోనే చంద్రబాబు నోరులేని ఈవీఎంలపై , ఈసీపై నేరం నెట్టాలని చూస్తున్నారని మండిపడితే ఇక ఏకంగా వైసీపీ గెలుస్తుంది అని లెక్కలు చెప్పేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు.

వైసీపీ 110 స్థానాల్లో విజయం సాధిస్తుంది అంటున్న బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు

వైసీపీ 110 స్థానాల్లో విజయం సాధిస్తుంది అంటున్న బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు

ఒకపక్క ఏపీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు అన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతుంటే నేతలు మాత్రం ఎన్నికల ఫలితాలను తేల్చి పారేస్తున్నారు. ఇక ఆ కోవలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తోందని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 110 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు మురళీధర రావు . చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించిన ఆయన ఎన్డీయే ద్వారాలు చంద్రబాబుకు శాస్వతంగా మూసివేశామని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. చంద్రబాబు తిరిగి ఎన్డీఏలోకి వచ్చే అవకాశమే లేదని దేశంలో బీజేపీ సర్కార్ మరోమారు అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు .

చంద్రబాబుని ప్రజలు తిరస్కరించారు .. ఏపీలో విజయం వైసీపీదే అన్న బీజేపీ జాతీయ నేత

చంద్రబాబుని ప్రజలు తిరస్కరించారు .. ఏపీలో విజయం వైసీపీదే అన్న బీజేపీ జాతీయ నేత

ఏపీ ప్రజలు చంద్రబాబు ను తిరస్కరించారని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజల తిరస్కరణకు గురైన చంద్రబాబును ప్రజలు ఆదరించలేదని ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు అంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఏపీ ప్రజలను అన్ని విధాలుగా మోసగించారని ఇక మోసపోయేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు మురళీధర్ రావు . ఇప్పటికే ప్రజలు చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేశారని చెప్పిన ఆయన ఇప్పటికే అన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని మురళీధర్ రావు స్పష్టం చేశారు.

దేశంలో బీజేపీ , ఏపీలో వైసీపీదే హవా అని జోస్యం చెప్పిన బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు

దేశంలో బీజేపీ , ఏపీలో వైసీపీదే హవా అని జోస్యం చెప్పిన బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు రావడం ఖాయమన్నారు. 2014 ఎన్నికల్లో మోడీకి మెజారిటీ రాదన్నారు..కానీ అది అబద్ధమని తేలిందని గుర్తు చేశారు. ఈసారి కూడా మోడీ తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశమంతా మోదీ పేరు మారుమోగుతుందని పేర్కొన్నారు. ఇక ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పిన మురళీధర్ రావు చంద్రబాబును ఇంటికి పంపించటం ఖాయం అన్నారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+