Year Ender 2022 : ఈ ఏడాదీ పట్టాలెక్కని 3 రాజధానులు-హైకోర్టు తీర్పు దెబ్బ-సుప్రీంలో పోరాటం !
ఏపీలో 2019లో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే రాజధానిగా ఉన్న అమరావతి స్ధానంలో మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్ .. మూడేళ్లు గడిచిపోతున్నా ఇప్పటికీ వాటిని పట్టాలెక్కించలేకపోయింది. అంతే కాదు మూడేళ్లు గడుస్తున్నా ప్రజల్లో తమకు మూడు రాజధానులే కావాలనే బలమైన భావనను తీసుకురాలేకపోయింది. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా త్వరలోనే విశాఖకు రాజధాని తరలింపు పేరుతో లీకులిస్తూ కాలం గడిపేయాల్సిన పరిస్ధితి.

వైసీపీ మూడు రాజధానులు
ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ 2019 డిసెంబర్ లో తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల ఫార్ములాను సమర్ధించుకునేందుకు బోస్టన్ గ్రూప్, జీఎస్ రావు కమిటీ నివేదికల్ని తయారు చేయించారు. అసెంబ్లీలో మూడు రాజధానుల కోసం రెండు బిల్లులు ప్రవేశపెట్టారు. మండలిలో ఆమోదం పొందకపోవడంతో ఏకంగా మండలి రద్దుకే సిద్ధమయ్యారు. చివరికి గవర్నర్ తో ఎలాగోలా ఆమోద ముద్ర వేయించారు. కానీ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఇదంతా బూమరాంగ్ అయిపోయింది. చివరికి ఇప్పటికీ మూడు రాజధానులు అమల్లోకి వస్తాయా రావా అంటే కచ్చితమైన సమాధానం ఎవరి వద్దా లేదు.

అమరావతిని సమర్ధించిన హైకోర్టు
వైసీపీ సర్కార్ తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కిన రైతులు, విపక్షాలు.. హైకోర్టును ఆశ్రయించడంతో ఇది కాస్తా న్యాయ వివాదంగా మారిపోయింది. చివరికి విచారణ జరిపిన హైకోర్టు.. అమరావతిని ఆరునెలల్లో పూర్తి చేయాలని, రైతులకు పరిహారం కూడా ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైసీపీ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఏడాది మార్చిలో వెలువడిన హైకోర్టు తీర్పుపై సెప్టెంబర్ వరకూ మౌనంగా ఉండిపోయిన జగన్ సర్కార్.. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ ఏడాది హైకోర్టు తీర్పు తర్వాత ఈ న్యాయపోరాటం కాస్తా సుప్రీంకోర్టుకు చేరినట్లయింది.

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
అమరావతి రాజధానికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా...రైతులు కూడా ఈ తీర్పును పూర్తిగా అమలుచేయాలంటూ సుప్రీం గడప తొక్కారు. దీంతో విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు అమరావతి నిర్మాణం కోసం పెట్టిన గడువుల్ని తోసిపుచ్చింది. దీంతో ఈ విషయంలో వైసీపీ సర్కార్ కు తొలి ఊరట లభించింది. మిగతా అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఇదే ఊపులో సుప్రీంకోర్టు మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు చెప్పుకుంటూ రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

అమరావతి పాదయాత్ర వర్సెస్ వికేంద్రీకరణ సభలు
ఈ మధ్యలోనే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని వైసీపీ సర్కార్ పై ఒత్తిడి పెంచేందుకు రైతులు అరసవిల్లికి పాదయాత్ర ప్రారంభించారు. మూడు జిల్లాల్లో బాగానే కొనసాగిన ఈ యాత్రకు తూర్పు గోదావరికి వచ్చే సరికి ఆటంకాలు మొదలయ్యాయి. పోలీసులు కూడా ఆంక్షల పేరుతో అడ్డుకోవడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా పూర్తిగా ఊరట దొరక్కపోవడంతో పాదయాత్ర పూర్తిగా నిలిచిపోయింది. అదే సమయంలో పాదయాత్రకు కౌంటర్ గా వైసీపీ సర్కార్ ప్రాంతాల వారీగా వికేంద్రీకరణ సభలు నిర్వహించడం మొదలుపెట్టింది. పాదయాత్ర నిలిచిపోయినా వికేంద్రీకరణ సభలు మాత్రం కొనసాగుతున్నాయి. దీంతో అమరావతి రైతులు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో నిరసనలు తెలిపేందుకు తరలివెళ్లారు.
-
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
రఘురామకు హైకోర్టులో షాక్ -ఆకివీడు గుడిపై కీలక ఆదేశాలు..! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
నెలకు రూ. 1,47,760 వరకు జీతంతో ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు.. -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!! -
వివేకా దర్యాప్తు వ్యవహారంలో అనూహ్య పరిణామం, కీలక మలుపు..!!











Click it and Unblock the Notifications