Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నారా లోకేష్ కు అందివచ్చిన సువర్ణావకాశం?

International Yoga Day 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. అరుదైన ఘనతను సాధించింది. ఓ సరికొత్త రికార్డును నెలకొల్పింది.

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. ఈ తెల్లవారు జామున విశాఖ ఆర్ కే బీచ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మూడు లక్షల మందికి పైగా పాల్గొన్నారు. ఓ యోగా కార్యక్రమంలో ఇంతమంది పాల్గొనడం ఓ రికార్డు.

Yogandhra gets New Guinness World Record in Visakhapatnam

గతంలో గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో 1,47,952 మంది పాల్గొన్నారు. ఇప్పుడు దీనికి రెట్టింపు సంఖ్యలో ప్రజలను సమీకరించుకోగలిగింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని రప్పించుకోగలిగింది.

కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ దీనికి హాజరయ్యారు. మంత్రి వంగలపూడి అనిత (హోం), వై సత్యకుమార్ (వైద్య-ఆరోగ్యం).. సహా పలువురు మంత్రులు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు, లక్షలాదిమందితో విశాఖనగరం సందడిగా మారింది.

ఈ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దగ్గరుండి పర్యవేక్షించారు. జనసమీకరణ మొదలుకుని విశాఖపట్నంలో ఏర్పాట్ల వరకూ అన్ని అంశాలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్రనో పోషించారు.

యోగా పట్ల రాష్ట్ర ప్రజల్లో సమగ్ర అవగాహన, చైతన్యాన్ని కలిగించడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును బద్దలు కొట్టడం అనే లక్ష్యాలను నారా లోకేష్ అందుకోగలిగారు. గిన్నిస్ బుక్ రికార్డును అందుకోవడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెప్పును కూడా పొందగలిగారాయన. మోదీ తన ప్రసంగంలో నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని దీనికి నిదర్శనంగా తీసుకోవచ్చు.

యోగా దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంత్రి నారా లోకేష్ చాలా కృషి చేశారని మోదీ ప్రశంసించారు. యోగాను ఒక సామాజిక ఉత్సవంలా ఎలా నిర్వహించాలి, సమాజంలోని అన్ని వర్గాలను అందులో ఎలా భాగస్వాములను చేయాలి, వీటన్నిటిపైనా గడచిన నెలన్నర రోజులుగా శ్రమించి చేసి చూపించారని కితాబిచ్చారు.

ఇటువంటి ఒక సామాజిక కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి దేశ ప్రజలందరికీ ఈ కార్యక్రమాన్ని ఒక నమూనాగా నారా లోకేష్ నిలిపారు మోదీ పేర్కొన్నారు. యోగాంధ్రపై అన్నివర్గాల్లో నారా లోకేష్ చైతన్యం కల్పించారని, యోగాంధ్ర కార్యక్రమంపై విజయవంతం చేయడానికి ఎంతగానో కృషి చేశారని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+