శుభవార్త: కరెంట్ బిల్ కట్టక్కరలేదు.. మీకే ఎదురు డబ్బులు!
దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు మేలు చేసే అనేక విశేషమైన పథకాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఎన్నో కేంద్ర పథకాలు ఉన్నప్పటికీ, ఆ కేంద్ర పథకాల ప్రయోజనం చాలామందికి తెలియడంలేదు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వెన్నుదన్నుగా ఉంటున్న పథకాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి పథకాలలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన ఒకటి.
పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం మన ఇళ్ళల్లో సౌర విద్యుత్ వెలుగులను అందించడమే కాకుండా, మనకు ఆదాయాన్ని కూడా అందిస్తుంది. ప్రతి ఒక్కరు ప్రతినెల పెరుగుతున్న కరెంటు బిల్లుల భారంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే మధ్యతరగతి కుటుంబాల పైన కరెంటు బిల్లుల భారం పడకుండా ఉండటం కోసం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా ప్లాన్
ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఇంటి పైన రెండు కిలోవాట్ల సౌర విద్యుత్ పానెల్ ను ఏర్పాటు చేస్తే నెలకు 200 నుంచి 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇంతకంటే తక్కువగా మన విద్యుత్ వినియోగం ఉంటే ఆ మిగులు విద్యుత్ ను డిస్కంలు తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
25 సంవత్సరాల పాటు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు
ఈ పథకం ద్వారా ఇళ్లపైన సౌర విద్యుత్తు ప్యానల్ ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల పాటు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా కరెంటు పొందవచ్చని, అలాగే ఈ ప్యానల్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తుందని చెబుతున్నారు.నెట్ మీటరింగ్ విధానం ద్వారా వినియోగదారులు ఉత్పత్తి చేసిన విద్యుత్తుకు మించి వాడిన బిల్లుల భారం పెద్దగా ఉండదని అధికారులు చెబుతున్నారు.
డిస్కంలు యూనిట్ కు 2 రూపాయల 9 పైసల చొప్పున కొనుగోలు
ఈ సౌర విద్యుత్ ప్యానల్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్తు మిగులు ఉంటే, డిస్కంలు యూనిట్ కు 2 రూపాయల 9 పైసల చొప్పున కొనుగోలు చేస్తాయని ఇది మంచి ఆదాయం మార్గమని అధికారులు చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో గృహ, వాణిజ్య, వ్యవసాయ పరిశ్రమలు కలిపి సుమారు 2.2 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని 1.56 కోట్ల గృహ కనెక్షన్లు ఉన్నాయని చెప్తున్నారు.
పీఎం సూర్యఘర్ రాయితీ ఇలా
పీఎం సూర్య ఘర్ కింద 20 లక్షల ఇళ్ల పైన రెండు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. దీని ద్వారా 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఒక అంచనా. ఇక రెండు కిలోమీటర్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు కేంద్రం 60 వేల రూపాయల రాయితీ ఇస్తుండగా, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20,000 ఇస్తూ వీటి ఏర్పాటును ప్రోత్సహిస్తోంది.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications