'బాహుబలి-2' సీడీ కావాలా నాయనా? కేవలం రూ. 30 మాత్రమే!

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: 'కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం, ఏళ్ల పాటు కష్టించి సినిమాను నిర్మించాం... దయచేసి ఈ సినిమాను పైరసీ చేయకండి', అంటూ దర్శక నిర్మాతలు, నటీనటులు ఎంతగానో వేడుకున్నా పైరసీ కేటుగాళ్లు పంజా విసురుతూనే ఉన్నారు.

తాజాగా సంచలన విజయం సాధించిన 'బాహుబలి-2' సినిమా కూడా పైరసీ కోరల్లో చిక్కుకుంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఈ సినిమాకు సంబంధించిన సీడీలు విచ్చలవిడిగా లభిస్తున్నాయి.

You Want Bahubali-2 Movie CD? It costs only Rs.30

పలు సీడీ దుకాణాలపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది చేసిన దాడుల్లో భారీ సంఖ్యలో ఈ సినిమా పైరసీ సీడీలు బయటపడ్డాయి. ఒక్కో సీడీని కేవలం రూ. 30కే అమ్మేస్తున్నారు ఆయా దుకాణాల నిర్వాహకులు.

ఈ సీడీలన్నీ చెన్నై నుంచి వస్తున్నాయని షాపు యజమానులు తెలిపారు. తాము పైరసీ సీడీలను అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేస్తూనే ఉన్నామని, ప్రజల్లో మార్పు వస్తే తప్ప ఈ పైరసీ భూతం ఆట కట్టించలేమని టాస్క్ ఫోర్స్ అధికారులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sensational Movie Bahubali-2 piracy cds are availaible for low cost.. that too for Rs.30 only. The piracy business is going well in chennai. From chennai this movie cds came to vijawada and visakhapatnam. The taskforce police told that they are raiding many shops which are selling piracy cds of latest movies including Bahubali 2.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి