వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు 35 ఏళ్లు ఉంటారు...మాకు ప్రతి ఐదేళ్లకీ పరీక్ష;సహించను:అధికారులతో సిఎం చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

అమరావతి:ప్రభుత్వ అధికారులకు ఒకసారి ఉద్యోగం వస్తే 35 ఏళ్లపాటు ఉంటారని...కానీ, ప్రభుత్వం మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పరీక్ష రాయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

బుధవారం సిఎం చంద్రబాబు అమరావతి ఆర్టీజీ సెంటర్‌లో రాష్ట్ర మంత్రులు, శాఖాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు క్షేత్రస్థాయి నుంచి శాఖాధిపతి వరకు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతమైన పనితీరు కనబరిస్తేనే లక్ష్యాలను చేరుకోగలుగుతామని...విధుల్లో అలసత్వం, ఉదాశీనత పనికిరాదని...అలాంటి వారిని సహించబోనని సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు.

You will continue 35 years in Service...We have to face exam every five years: CM Chandrababu

ప్రభుత్వ వ్యవస్థను నడిపించేది అధికారులేనని, ప్రజలను సంతృప్తిపరిచేలా పనిచేయాలని సిఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. "మనమెంత కష్టపడుతున్నామో జాతీయ స్థాయిలో వస్తున్న పురస్కారాలే చెబుతున్నాయి...అయితే ఇది చాలదు...రెట్టింపు వేగం, రెట్టింపు కష్టంతో పనిచేసినప్పుడే లక్ష్యాలు సాధించగలుగుతాం...ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడమే అధికారులకు అంతిమ లక్ష్యం కావాలి"...అని సిఎం చంద్రబాబు అధికారులకు ఉద్భోదించారు.
ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సంతృప్తి శాతం ఆశించిన స్థాయిలోనే ఉందని...అయితే దీన్ని ఇంకా మెరుగుపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇకమీదట ప్రభుత్వ శాఖల పనితీరును బట్టి గ్రేడింగ్‌ ఇస్తాం. ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా ర్యాంకులిస్తాం. ఆయా శా ఖలు అమలుచేస్తున్న పథకాలకు కూడా గ్రేడింగ్‌ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. వివిధ శాఖలకు వచ్చిన గ్రేడ్ల వివరాలు తెలిపారు. చంద్రన్న బీమా పథకం, పౌరసరఫరాలు, సాంఘిక సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖలకు 'ఏ' గ్రేడ్‌ వచ్చిందని...విద్యాశాఖ పనితీరు బాగాలేదని అన్నారు.

ఇకమీదట అన్ని శాఖల పనితీరును ప్రతినెలా ఆర్టీజీ కేంద్రంలో సమీక్ష నిర్వహిస్తానని, ఆయా శాఖలకు ర్యాంకులు కేటాయిస్తానని చంద్రబాబు చెప్పారు. ఆర్టీజీ కేంద్రం అంటే అదేదో తన ఒక్కడిదీ కాదని, మంత్రులు, ఉన్నతాధికారులంతా ఇక్కడకు వచ్చి సమాచారం తీసుకోవాలని ఆయన హితవు పలికారు. ప్రజలు మన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సత్వరం పరిష్కరించి చూపగలిగితేనే సుపరిపాలన అనిపించుకుంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేనంత పెద్దఎత్తున సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నాం. గ్రామీణాభివృద్ధి మన రాష్ట్రంలో జరిగినట్లు మరెక్కడా జరగలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

రాష్ట్రానికి కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోందని, అయినా కుంగిపోక దీక్షాదక్షతలతో పనిచేసి ఫలితాలు సాధిస్తున్నామని...ఇది వారికి కంటగింపుగా ఉండొచ్చని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మన పనితీరును ఇంకా మెరుగుపర్చుకుంటే మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. ప్రకృతి సేద్యంలో మనం చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందన్నారు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటే అంతా ఏపీవైపు చూస్తున్నారని...ఇది సంతోషకరమన్నారు. దీంతో మన బాధ్యత మరింత పెరిగిందని గుర్తించాలన్నారు. గ్రామదర్శినిలో నిర్దేశిత లక్ష్యాలను ప్రజలకు వివరించాలని, వారి సహకారం ఉంటే ఏదైనా సాధించగలమన్నారు.

English summary
Amaravathi:AP CM Chandra babu said that..."Government officers will have 35 years in service if they get job once ...but the Government will have to face examination every five years".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X