పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..!

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మరోసారి రాజకీయ మాటల యుద్దం సాగుతోంది. సీఎం చంద్రబాబును ఉద్దేశించి తాజాగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు, అనంతరం ఆయనకు కౌంటర్ ఇచ్చే క్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (pemmasani Chandrasekhar) చేసిన విమర్శలపై చర్చ జరుగుతోంది. దీంతో పెమ్మసాని వ్యాఖ్యల్ని తప్పుబడుతూ వైసీపీ నేత అంబటి రాంబాబు (ambati Rambabu)ఆయనకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ మాటల యుద్దం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.

చంద్రబాబును ఉద్దేశించి జగన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదని తాజాగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో కౌంటర్ ఇచ్చారు. ఆయన్ని ఒక్క మాటతో చంపేయగలం, కానీ మాకు సంస్కారం ఉంది అంటూ తీవ్ర హెచ్చరిక చేశారు. విలువలు, పెరిగిన పద్ధతి తమను అడ్డుకుంటున్నాయన్నారు. దమ్ముంటే తమను రాజకీయంగా ఎదుర్కోవాలంటూ పెమ్మసాని జగన్ కు సవాలు విసిరారు. చంద్రబాబు నేర్పిన క్రమశిక్షణ వల్ల తాము సంయమనం పాటిస్తున్నామన్నారు.

You ll Fall in America if Kick you Ambati Rambabu s Fierce Warning to Pemmasani Chandrasekhar

దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ లో స్పందించారు. మాటతోనే చంపే రౌడీవా పెమ్మసాని! అంటూ ట్వీట్ లో అంబటి ఆయన్ను ప్రశ్నించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త! అంటూ పెమ్మసాని చంద్రశేఖర్ ను అంబటి హెచ్చరించారు. దీంతో టీడీపీ-వైసీపీ మధ్య సాగుతున్న మాటల యుద్ధం పరాకాష్టకు చేరినట్లయింది. గతంలో అంబటి అరెస్టు సందర్భంగా కూడా పెమ్మసాని.. వైసీపీ నాయకులకు సినిమా చూపిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+