ఫేస్‌బుక్‌లో అసభ్య చిత్రాలు పెట్టి యువతికి వేధింపులు

 A youth allegedly harassed a girl with abscene pictures in Facebook
విశాఖపట్నం: సోషల్ నెట్‌వర్క్‌ సైట్ ఫేస్‌బుక్‌లో అసభ్యకర చిత్రాలు పెట్టి యువతిని వేధింపులకు గురి చేస్తున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేస్‌బుక్‌లో తనను వేధింపులకు గురిచేస్తున్నాడని అనకాపల్లికి చెందిన యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు విశాఖపట్నం సిఐ చంద్ర తెలిపారు.

ఎల్‌బినగర్‌లో ఉద్యోగం చేసే సమయంలో పరిచయమైన రాజు వేధింపులు భరించలేక ఆ యువతి ఉద్యోగం వదిలి వచ్చిందని చెప్పారు. దీంతో రాజు ఫేస్‌బుక్ ద్వారా తనను వేధించడం ప్రారంభించాడని యువతి ఫిర్యాదు చేసిందని తెలిపారు.

నేవీ ఉద్యోగినంటూ మోసం

నేవీ ఉద్యోగినంటూ పరిచయం చేసుకుని, స్నేహం నటించి బంగారు గొలుసు, నగదు, వాహనాన్ని ఎత్తుకెళ్లిన సంఘటన అనకాపల్లిలో చోటు చేసుకుంది. బాధితులు నెట్టెం మధు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. కొంత కాలం క్రితం నాగేంద్ర అనే వ్యక్తి మధుకు నేవీలో ఉద్యోగినంటూ పరిచయమయ్యాడు.

తనకు మంచి ఉద్యోగం వేయిస్తానని ఆశ చూపి పరిచయాన్ని పెంచుకున్నాడు. పెళ్లి చూపులకు వెళ్లి వస్తానని చెప్పి మెడలోని రెండు తులాల బంగారం గొలుసు, రూ. 35వేల నగదు, వాహనం తీసుకొని పరారయ్యాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+