గర్ల్స్‌ముందు అర్ధనగ్న ప్రదర్శన, పోలీసులకు పరుగులు

హైదరాబాద్/ఖమ్మం: అమ్మాయిల ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతను పోలీసులను పరుగులు పెట్టించాడు. ఫహాద్ అలీ అనే వ్యక్తి హైదరాబాదులోని ఓ కళాశాల వద్ద కొంతకాలంగా అర్దనగ్న ప్రదర్శన చేస్తూ... వెకిలిచేష్టలతో విద్యార్థినులను, స్థానిక మహిళలను ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శుక్రవారం సాయంత్రం నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు అతని దగ్గరకు వెళ్లబోయారు. వారిని గమనించిన అలీ బైకుపై పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు అతడిని వెంటాడారు. అరగంట పాటు ఈ చేజింగ్ సాగింది. నిందితుడు చివరకు ద్విచక్ర వాహనాన్ని వదిలి పరుగెత్తి కనిపించకుండా పోయాడు. శనివారం నారాయణ నారాయణగూడ ట్రాఫిక్ పోలీసు ఠాణాలో ప్రత్యక్షమయ్యాడు. మన్నించాలని కోరాడు. పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

Youth arrested by police in Hyderabad on Saturday.

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ఖమ్మంలోని స్థానిక ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థిని శనివారం ఐదో అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణం చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రమ్య(17) అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మధ్యాహ్నం వరకు అందరితో కలివిడిగా ఉంది.

తర్వాత తోటి విద్యార్థినులతో మాట్లాడకపోవటం, మౌనంగా ఉండి సాయంత్రం మంచినీరు తాగేందుకు వెళ్తున్నట్లు మాత్రం చెప్పింది. అదే సమయంలో కళాశాలలోని ఐదో అంతస్తు ఎక్కి అక్కడి నుంచి దూకింది. వెంటనే స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+