చిన్నారిపై రేప్ యత్నం: రియల్టర్‌పై దాడి యత్నం

విజయనగరం/ విశాఖపట్నం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరులో గురువారం ఏడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆ బాలికను ఇడ్లి ఇప్పిస్తానని బుజ్జగించి కొంతదూరం తీసు కెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక బంధువుల ఫిర్యాదుమేరకు పోలీ సులు నిందితుడిని అరెస్టు చేశారు.

మహిళ దారుణ హత్య

ఇదిలావుంటే, విశాఖ పట్నం జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామ శివార్లలో గుర్తు తెలియని ఓ మహిళ (30) దారుణహత్యకు గురైంది. మహిళ ఒంటిపై గాయాలున్నాయి. మృతదేహం రోడ్డుపై బోర్లాపడి ఉంది. మృతదేహానికి సమీపంలో ఆ మహిళ వచ్చిన స్కూటీ పడి ఉంది. పోలీసులు శుక్రవారం ఉదయాన్నే సంఘటన స్థలానికి చేరుకొని ఈ హత్యా సంఘటనపై విచారణ జరుపుతున్నారు.

Youth attempted to rape 7 year old girl

రియల్టర్‌పై దాడియత్నం

విశాఖపట్నం జిల్లాలోని గాంధీనగర్‌లో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కళ్లలో కారం పొడి చల్లి కత్తులతో దాడి చేసేందుకు దుండుగులు యత్నించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఫోర్త్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో ఎన్నికల సమయంలో డబ్బుల పంపకంలో విభేదాలే దాడికి కారణంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యాయత్నానికి పాల్పడినవారు, బాధితుడు 11వ వార్డులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తగా వ్యవహరించారు.

తన పిల్లలను స్కూలుల్లో విడిచిపెట్టేందుకు వెళ్తున్న క్రమంలో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో చిన్నారులు కిందపడటంతో స్వల్ప గాయాలయ్యాయి. గతంలో కూడా ఇలాంటి దాడులకు పాల్పడ్డారంటూ బాధితులు ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+