వంచన: గర్ల్‌ని పెళ్లి చేసుకొని.. లైంగిక దాడి, నగల దోపిడీ

కథనం ప్రకారం... తమిళనాడు రాష్ట్రం పల్లికొండ సమీపంలోని కీల్‌చేర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతి ఓ షూ కంపెనీలో పని చేస్తోంది. ఆమెకి అంబూరు సమీపంలోని మేల్‌వయిదన కుప్పానికి చెందిన టైలర్ మురుగతో రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. పెళ్లి కోసం నగలు తీసుకు రావాలని అతను చెప్పాడు. దీంతో ఆమె పెళ్లి కోసం నగలను సిద్ధం చేసుకుంది.
ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేశాడు. దీంతో అతను తనను బలంగా ప్రేమిస్తున్నాడని నమ్మిన ఆమె గురువారం ఉదయం నగలతో పాటు ఇంటి నుంచి వచ్చేసింది. ఆమెను తీసుకుని మురుగ కాణిపాకం వచ్చాడు. అక్కడ ఉదయం 10.30 గంటలకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి తమిళనాడు వెళ్తుండగా మార్గమధ్యలో పలమనేరు మండలంలోని కాలువపల్లె కౌండిన్యా అటవీప్రాంతం చాలా బాగుంటుందని చెప్పి అడవిలోకి తీసుకెళ్లాడు.
అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకున్న అతను ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న బంగారం లాక్కొన్నాడు. ఆమెను ఓ పెద్ద బండ రాయితో మోదాడు. ఆమె తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. ఆమె చనిపోయిందని భావించిన అతను నగలతో ఉడాయించాడు. స్పృహలోకొచ్చిన బాధితురాలిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications