అమ్మాయి సైకిల్‌ను బైక్‌తో గుద్దిన పోకిరీలు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో పోకిరీలు ఓ విద్యార్థిని సైకిల్‌ను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టారు. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని సైకిల్ పైన కళాశాలకు వెళ్తోంది. పోకిరీలు ఆమె సైకిల్‌ను బైక్‌తో ఢీకొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం ఉదయం జిల్లాలోని పొన్నూరులో జరిగింది.

గాయపడ్డ యువతిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆ పోకిరీలు నెలరోజులుగా ఆమెను వేధిస్తున్నారని తెలుస్తోంది. నిందితులు సందీప్‌, చంద్రకాంత్‌‌గా గుర్తించారు. బైక్‌ ఎక్కాలంటూ ఆమెను గతంలో బలవంతం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. నిందితులు పరారీలో ఉన్నారు.

ప్రైవేటు డ్రైవర్లపై ఆర్టీసీ కార్మికుల దాడి

Youth hit cycle, girl injured

43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండు చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు కార్మికులను నియమించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు డిపోలో ప్రైవేటు కార్మికులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపోలో ఓ ప్రయివేటు డ్రైవరుపై ఆర్టీసీ కార్మికులు దాడి చేశారు.

అదుపు తప్పి లోయలో పడిన బస్సు

విశాఖపట్నం జిల్లా గూడెంకొత్తవీధి మండలం జరల ఘాట్ రోడ్డులో ప్రయాణీకులతో వెళ్తున్న జీపు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో పదిమంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+