భర్త చనిపోయాక వివాహేతర సంబంధం: గర్భవతి అయ్యాక ప్రియుడి చేతిలో హత్య
కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఆమె ప్రియుడు సిద్ధూ నమ్మించి, పథకం ప్రకారం హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
గత కొంతకాలంగా డొన్ పట్టణానికి చెందిన సిద్ధు, రమిజల మధ్య వివాహేతర సంబంధం ఉంది. రమిజ భర్త చనిపోగా ఆరేళ్ల కుమారుడితో కలిసి ఉంటోంది. సిద్ధూతో పరిచయం అనంతరం గర్భం దాల్చింది.

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో సిద్ధూ ఆమెను చంపేందుకు ప్లాన్ వేశాడు. నంద్యాలకు వెళ్లి కాపురం పెడదామని నవంబర్ నెలలో నమ్మించాడు.
బస్సు ఎక్కించి డోన్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో దించాడు. ఆమె గొంతుకు తాడు బిగించి చంపేశాడు. తన కూతురు కనిపించడం లేదని తల్లి లక్ష్మీదేవి గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి వివరాలు రాబట్టారు.












Click it and Unblock the Notifications