గొడ్డలితో భార్యను నరికి చంపిన భర్త, ప్రేమ కోసం అపార్ట్‌మెంట్ పైకెక్కి యువకుడి హల్‌చల్

అమరావతి: తాను ప్రేమించిన యువతితో పెళ్లి జరిపించకుంటే అపార్ట్‌మెంట్ పైనుంచి దూకుతానని అజయ్ అనే యువకుడు బెదిరింపుకు పాల్పడ్డాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని అబిద్ నగర్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

తాను ప్రేమించిన యువతికి వేరే వ్యక్తితో వివాహం జరిపిస్తున్నారని తెలుసుకుని బుధవారం ఉదయం అజయ్ అనే యవకుడు అబిద్ నగర్‌లో తాను నివసిస్తోన్న అపార్ట్ మెంట్ పైకి ఎక్కి దూకుతానని హల్ చల్ చేశాడు. ఆపార్ట్‌మెంట్ చాలా ఎత్తులో ఉండటంతో ఎక్కడ కిందకు దూకుతాడోనని ఆందోళన చెందిన అక్కడి స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Youth suicide attempts due to love failure in visakhapatnam

దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కిందకు దిగాలని అజయ్‌కు సూచించారు. తాను ప్రేమించిన యువతితో పెళ్లి జరిపిస్తామని హామీ ఇస్తేనే కిందకు దిగుతానని, లేకపోతే దూకి చనిపోతానని హెచ్చరించాడు. సూమారు మూడు గంటల పాటు సాగిన ఈ హైడ్రామా అగ్నిమాపక సిబ్బంది చొరవతో తెరపడింది.

10.20 నిమిషాల ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది అతడిని కిందుకు దించడంతో అక్కడున్నవారంతా ఊపరి పీల్చుకున్నారు. అనంతరం అజయ్ మీడియాతో మాట్లాడుతూ తన ప్రేయసిని నాలుగు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఆ అమ్మాయి లేకుండా తాను జీవించలేనని అన్నాడు.

అనంతపురం జిల్లాలో దారుణం

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త గొడ్డలితో భార్యను దారుణంగా నరికి చంపిన సంఘటన జిల్లాలోని రాయదుర్గం మండలం కెంచానపల్లిలో చోటు చేసుకుంది.

భార్యను హత్య చేసే తరుణంలో అడ్డుగా వచ్చిన కొడుకుని తీవ్రంగా గాయపర్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో భార్యను గొడ్డలితో నరికిన చంపిన రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్య

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. గుమ్మగట్ట మండలం నేత్రపల్లిలో ప్రియుడి ఇంటి ముందు జయలక్ష్మీ అనే ప్రియురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం జయలక్ష్మీ మృతదేహాన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+