చేపలమ్ముకుంటున్నా, నా సంగతేంటి!: బాబును కంగుతినిపించిన యువకుడు
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని ప్రశ్న ఎదురయింది! ఈ సంఘటన ఆదివారం నాడు జరిగింది. తాను డిఎస్సీ పాసైన చేపలు అమ్ముకుంటున్నానని, తమకు పోస్టింగ్ ఎప్పుడిస్తారని చంద్రబాబును ప్రశ్నించారు.
పోస్టింగ్ ఇవ్వకపోవడంతో తాను చేపలు అమ్ముకుంటూ బతుకు వెళ్లదీస్తున్నానని చెప్పాడు. దీంతో కంగుతున్న చంద్రబాబు ఆ యువకుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విశాఖపట్టణంలో ఆదివారం నాడు చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. తనిఖీలలో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నున్న చేపలా మార్కెట్‌కు వెళ్లారు. చేపలమ్ముకుంటున్న ఓ యువకుడితో మాట్లాడారు.

మీ సమస్యలు ఏమిటని చంద్రబాబు ఆ యువకుడిని ప్రశ్నించారు. ఆ యువకుడి పేరు త్రినాథ్. ముఖ్యమంత్రి అడగటంతో తన సమస్యను అతను చెప్పుకున్నాడు.
2014లో డీఎస్సీ క్వాలిఫై అయి 45 వ ర్యాంకు సాధించానని, ఇంత వరకూ పోస్టింగ్ ఇవ్వలేదని, జీవనోపాధి కోసం చేపలు అమ్ముకుంటున్నానని చెప్పాడు. తనకు ఉద్యోగం ఎప్పుడిస్తారని అతను చంద్రబాబుని ప్రశ్నించాడు. వారం రోజుల్లో డీఎస్సీ పోస్టింగ్ లిచ్చే ఏర్పాటు చేస్తున్నామని బాబు హామీ ఇచ్చారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications