‘జగన్ సీఎం ఖాయం’: తిరుమలకు ఎమ్మెల్యే పాదయాత్ర

వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్ జగన్మోమోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తిరుమలకు పాదయాత్

గుంటూరు: వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్ జగన్మోమోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.

ఈ పాదయాత్రను శనివారం ఉదయం పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు.

yrcp mla gopireddy srinivas reddy begins padayatra for ys jagan

అలాగే తమ నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ యాత్రలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు 150 మంది పాల్గొంటుండటం విశేషం. రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 13 రోజుల్లో తిరుమలకు చేరుకుంటారు. పాదయాత్రలో కులాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని గోపిరెడ్డి కోరారు.

పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, అంబటి రాంబాబు, మహ్మద్‌ ముస్తాఫా, పార్టీ నేతలు రాజశేఖర్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డితోపాటు జిల్లా నేతలు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+