జగన్ ఓట్ బ్యాంక్ 1.40 కోట్ల కుటుంబాలు - ప్రజా తీర్పు సర్వే..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. జగన్ లక్ష్యంగా టీడీపీ - జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. సీఎం జగన్ వై నాట్ 175 నినాదంతో ఇప్పటికే పార్టీ శ్రేణులను ప్రజల మధ్యకు పంపారు. ఈ 54 నెలల కాలంలో అందించిన సంక్షేమమే తనకు మరోసారి అధికారం ఇస్తుందని జగన్ నమ్ముతున్నారు. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాల్లో 1.40 కోట్ల కుటుంబాలకు జగన్ చేరువ అయ్యారు. ఆ ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసుకోవటం కోసం వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో మరోసారి గడప గపడకు వైసీపీ శ్రేణులు బయల్దేరారు.

వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్:ప్రతిపక్ష పార్టీల కుట్రలను ఛేదిస్తూ వైసీపీ వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్య‌క్ర‌మం పేరుతో నేటి నుంచి ప్రజల్లోకి వెళ్తోంది. డిసెంబర్‌ 19 వరకూ గ్రామగ్రామాన కొనసాగనుంది. గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌, చ‌ర్చా వేదిక‌లు నిర్వ‌హించనున్నారు. వైసీపీ ప్ర‌భుత్వంలో జరిగిన మేలుపై 'ప్రజాతీర్పు' సర్వేతో కార్యక్రమాలు చేప‌డుతున్నారు. సచివాలయాల వద్ద రియల్‌ డెవలప్‌మెంట్‌ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. మ్యానిఫెస్టో అంశాల్లో దాదాపు 99.5 శాతం పూర్తి చేసిన సీఎం జగన్ భవిష్యత్తు ఎన్నికలకూ మ్యానిఫెస్టో పైన ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు.రాష్ట్రంలో 1 కోటి 60 లక్షల కుటుంబాల్లో దాదాపు 1 కోటి 40 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సంక్షేమ లబ్ధి అందుకున్నారు.

YRSCP to begin door-to-door campaign titled Why AP Needs Jagan to Reach out the public

మంచి జరిగిందని నమ్మితేనే:తమ కుటుంబాలకు మంచి జరిగిందని నమ్మితేనే తనకు మద్దతుగా నిలవాలని పదే పదే జగన్ సూచిస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో కుటుంబాలకు వివిధ రూపాల్లో ఆర్థిక వెసులుబాటు కలిగించారు. రాష్ట్రంలోని మెజార్టీ వర్గాలైన పేద, బడుగు బలహీనవర్గాలను నిర్ణయాత్మక శక్తిగా మారటంతో ఎన్నికల్లో తిరిగి అధికారం పైన వైసీపీలో ధీమాకు కారణం అవుతోంది. సీఎం జగన్ ను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో పని చేస్తున్న టీడీపీ విడుదల చేసిన సంక్షేమానికి ప్రజల్లో ఆదరణ కనిపించలేదు. అదిరిపోయే సంక్షేమం అంటూ ప్రచారం చేసిన గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టోకు రూపకల్పన చేస్తున్నారు. అయితే, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే విశ్వసనీయ జగన్ సొంతం కావటంతో ఎన్నికల వేళ అదే బ్రహ్మాస్త్రంగా మారుతోంది.

పార్టీ నేతల క్యాంపెయిన్:ఇదే సమయంలో అభివృద్ధి విషయంలోనూ ఈ క్యాంపెయిన్ లో పార్టీ నేతలు వివరించనున్నారు. జీఎస్‌డీ‌పీ లో.. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయిన నాటికి 22వ స్థానం ఉంటే.. 2021-22 లో ఏపీ నెంబర్‌ 1వ స్థానానికి చేరింది. తలసరి ఆదాయంలోకొస్తే 2019 నాటికి 17వ స్థానంలో ఉంటే ప్రస్తుతం అది 9 వ స్థానానికి వచ్చింది. చంద్రబాబు హయాంలో కేవలం 34వేల పోస్టుల్ని భర్తీ చేయగలిగితే.. అదే జగన్‌ అధికారం లోకి వచ్చాక ఆర్టీసీ విలీనంతో కలిపితే రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాలు 4.93 లక్షలు. ఇందులో పర్మినెంట్‌ ఉద్యోగాల వివరాల్ని తీసుకుంటే 2 లక్షల 13వేల 662 మందికి అవకాశం దక్కింది. దాదాపు 1.30 లక్షల ఉద్యోగాలు నేరుగా సచివాలయ వ్యవస్థ ద్వారా... వైద్యరంగంలో దాదాపు 50వేల మందికి శాశ్వత ఉద్యోగాలు వచ్చాయి. ఇవన్నీ వై ఏపీ నీడ్స్ జ‌గ‌న్ కార్య‌క్ర‌మంలో వివరించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+