అవినాశ్ కు సీబీఐ ప్రత్యేక పిలుపు - సుప్రీంలో కీలకం..!!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరుతో వివేకా కేసు విచారణ సీబీఐ ముగించాల్సి ఉంది. కడప ఎంపీ అవినాశ్ ను ఆదివారం అయినా విచారణకు రావాలని సీబీఐ ప్రత్యేకంగా పిలిచింది. ఈ మేరకు నోటీసు లు జారీ చేసింది. అవినాశ్ నుంచి సీబీఐ కీలక సమాచారం..డాక్యుమెంట్లు సేకరించింది. అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తు సునీత దాఖలు చేసిన పిటీషన్ రేపు (సోమవారం) విచారణ కు రానుంది. దీంతో..ఉత్కంఠ కొనసాగుతోంది.

ఎంపీ అవినాశ్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో కొన్ని షరతులను విధించింది. జూన్ నెల చివరి వరకు.. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం అవినాష్‌కు ఆదేశించింది.

YS AVinash Reddy Attends before CBI along with documents on Sunday

అవినాష్ ముందోస్తు బెయిల్ పొందిన తరువాత నాలుగో సారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 10 గంటలకు సీబీఐ అధికారుల ముందు హాజరు అవుతున్నారు. కాగా, ఈ రోజు (ఆదివారం) విచారణకు రావాలంటూ సీబీఐ సూచించింది. హాజరైన అవినాశ్ సీబీఐ ఆఫీస్‌కు పలు కీలక డాక్యుమెంట్లను తీసుకెళ్లారు. వాటిలోని అంశాలను అధికారులకు వివరించారు.

బ్యాంకు..ఆర్దిక లావాదేవీలకు సంబంధించి అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. మరో వైపు అవినాశ్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అనినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షులను ప్రభావితం చేస్తారని, ఆయన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత పిటిషన్ దాఖలు చేశారు.

సోమవారం ఈ పిటిషన్ పై విచారణ జరగనున్న క్రమంలో సీబీఐ తరపు లాయర్లకు సునీత తరపు న్యాయవాదులు సాయం చేసేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ తరపు న్యాయవాదులు, సునీత తరపు న్యాయవాదులు కలిపి పనిచేయనున్నారు. రేపు (సోమవారం) సుప్రీం కోర్టులో సునీత దాఖలు చేసిన పిటీషన్ విచారణ కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+