Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికలకు ముందే మంత్రి పదవుల పై జగన్ హామీ..!!

ఏపీలో ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. ముఖ్యమంత్రి జగన్ రోజు మూడు సభల్లో ప్రచారం చేస్తున్నారు. కూట‌మి కొత్త కొత్త మోసాల‌తో వ‌స్తోంది..ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని జగన్ పిలుపునిచ్చారు. మాట మీద నిలబడ్డ చరిత్ర చంద్రబాబుకి లేదని, మొన్నటి మేనిఫెస్టో చూస్తే బాబు చేయబోయే మోసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని అన్నారు. అనూహ్యంగా ముఖ్యమంత్రి జగన్ తన అభ్యర్దులన పరిచయం చేసే క్రమంలో ఉన్నత పదవుల పైన హామీ ఇస్తున్నారు.

పిన్నెళ్లికి మంచి పదవి
మాచర్లలో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. మాచర్ల నుంచి పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డిని గెలిపించాలని కోరారు.పిన్నెళ్లి ఉన్నత పదవిలో ఉంటారని సభలో ప్రకటించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో 59 నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులను గమనించాలని ఏపీ ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపే అన్నారు. మళ్లీ మోసపోటమే. చంద్రబాబుకి ఏరోజు మాట మీద నిలబడిన చరిత్ర లేదు. సాధ్యంకాని రీతిలో ఆయన ఇప్పుడు ఇచ్చిన హామీలు.. ఆయన చేయబోయే మోసాల్ని కళ్లకు కడుతున్నాయని చెప్పుకొచ్చారు

YS Jagan Alerts AP Public over TDP Alliance manifesto in his Electon campaign

పథకాలు కొనసాగాలంటే
ఈ ఐదు సంవత్సరాల్లో.. 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా రూ.2 లక్షల 70 వేల కోట్ల రూపాయల్ని అందించామని గుర్తు చేసారు. గవర్నమెంట్‌ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా.. గతంలో జరిగిందా..పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా చూసారా అని జగన్ ప్రశ్నించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా
ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు అందులో 20 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం చేపట్టామని జగన్ వివరించారు. అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్‌ గతంలో ఎప్పుడైనా జరిగిందా?, రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అంటూ జగన్ ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+