బోఫోర్స్, కోల్ స్కాంల కంటే పెద్దది.. ఇదిగో సాక్ష్యం, లోకేష్ హస్తం: జగన్ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీలో జరిగిన అగ్రిగోల్డ్ కుంభకోణం బోఫోర్స్, స్పెక్ట్రం, కోల్ స్కాం కంటే ఎంతో పెద్దది అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ తీరు భరించలేకపోయా, సిగ్గు శరం లేకుండా: ఊగిపోయిన జ్యోతుల

అగ్రిగోల్డ్ వ్యవహారంపై ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ పెద్ద స్కాం అన్నారు. ఇందులో పత్తిపాటి చీమ అని, ఎంపీలు, చంద్రబాబు కొడుకు హస్తం ఉందని చెబుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

20 ని.లు టైమిస్తే ఆధారాలు, లేదంటే బయటకెళ్లి చెప్తా: బాబుకు జగన్ హెచ్చరిక

గతంలో మహిళలపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలను తెరపైకి తీసుకు వచ్చి సభను తప్పుదోవ పట్టించారన్నారు. నేనో, పుల్లారావో ఉండాలని చెబుతున్నారని, అసలు చంద్రబాబుకు మెదడు ఉందా అన్నారు.

పత్తిపాటితో వ్యక్తిగత విభేదాల్లేవు.. ఆయనో చిన్న చీమ

పత్తిపాటితో వ్యక్తిగత విభేదాల్లేవు.. ఆయనో చిన్న చీమ

అగ్రిగోల్డ్ బాధితులు వాళ్లంతట వాళ్లే తనకు ఆధారాలు ఇచ్చారని చెప్పారు. సాక్ష్యాధారాలు చూపిస్తూ తనకు ఇరవై నిమిషాలు సమయం ఇవ్వమని అడిగానని చెప్పారు. తనకు, మంత్రి పత్తిపాటి పుల్లారావుకు మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు.

ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతకు అవకాశమివ్వరా అని ప్రశ్నించారు. ఇరవై లక్షల మందికి టోపీ పెట్టిన వేల కోట్ల కుంభకోణం అగ్రిగోల్డ్ అన్నారు. ఈ కుంభకోణంలో మంత్రి పత్తిపాటి చిన్న చీమలాంటి వారన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.

సీబీఐ విచారణ జరిపాలి

సీబీఐ విచారణ జరిపాలి

విచారణ జరిపితే స్కాం అంతా బయటకు వస్తుందన్నారు. పుల్లారావో, నేనో సభలో ఉండాలని టిడిపి నేతలు చెబుతున్నారని, అలా అయితే అగ్రిగోల్డ్ ఆస్తులు తిరిగి వస్తాయా అని ప్రశ్నించారు. సభలో నాపై తీర్మానం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. అది వింత తీర్మానమన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

అగ్రిగోల్డ్ గురించి మాట్లాడుతుంటే టాపిక్ డైవర్ట్ చేసే కార్యక్రమం ఎందుకు అని నిలదీశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఎందుకు వేయడం లేదో చెప్పాలన్నారు. మా సవాళ్లను ఎప్పుడైనా చంద్రబాబు పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. అసలు 21 మంది టిడిపిలో చేరారని, ఆ చోట్ల ఉప ఎన్నికలు జరగాలన్నారు. అక్కడ మాకు మెజార్టీ వస్తే చంద్రబాబు సభకు వెళ్లవద్దన్నారు.

ఓటుకు నోటు కేసులో దొరికాడు..

ఓటుకు నోటు కేసులో దొరికాడు..

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికాడన్నారు. ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికాడన్నారు. ఆ వాయిస్ తనది కాదని చంద్రబాబు చెప్పగలడా అని సవాల్ విసిరారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అంటే అలుసా అని ప్రశ్నించారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమివ్వరా అని అడిగారు.

అగ్రిగోల్డ్ వేలంలోకి కొన్ని భూములు ఎందుకు రావడం లేదో చెప్పాలన్నారు. 19 లక్షల మందికి సంబంధించి రూ.3,900 కోట్లు ఏమయ్యాయో చెప్పాలన్నారు. ఈ వ్యవహారంలో ఎంపీలు, చంద్రబాబు కొడుకు (లోకేష్) హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయన్నారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అంటే తెలుసా అన్నారు. సీఎంకు జ్ఞానోదయం చేయమని అగ్రిగోల్డ్ బాధితులు తనకు చెప్పారన్నారు.

ఇవీగో సాక్షాలు

ఇవీగో సాక్షాలు

మీడియా ద్వారా ప్రజలకు సాక్షాలు చూపిస్తానని జగన్ అన్నారు. ఈ సందర్భంగా జగన్ కొన్ని పత్రాలను మీడియాకు చూపించారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించి ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారన్నారు. హాయ్ లాండ్ వేలంలోకి ఎందుకు రావడం లేదో చెప్పాలన్నారు. విశాఖ జిల్లాలోని యారాడలో 116 ఎకరాల భూములు వేలంలోకి ఎందుకు రాలేదన్నారు.

ఇదీ దినకరన్...

ఇదీ దినకరన్...

పత్తిపాటి భార్యకు భూములు అమ్మింది దినకరన్ అని చెప్పారు. దినకరన్ అగ్రిగోల్డులో డైరెక్టర్ అని చెప్పారు. అర్కా లీజర్ ఎంటర్‌టైన్మెంటులో దినకరన్ 2010 నుంచి డైరెక్టర్‌గా ఉన్నారని చెప్పారు. మరో కంపెనీకి కూడా డైరెక్టర్‌గా ఉన్నారన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరగాలన్నారు. ఈ స్కాంలో పత్తిపాటి చిన్న చీమ లాంటి వారు అన్నారు.

ఇదే నా డిమాండ్.. బోఫోర్స్, కోల్, స్పెక్ట్రం స్కాం కంటే పెద్దది

ఇదే నా డిమాండ్.. బోఫోర్స్, కోల్, స్పెక్ట్రం స్కాం కంటే పెద్దది

అగ్రిగోల్డ్ భూములను గద్దల్లా తన్నుకు పోయారన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం గద్దలకు మద్దతు ఇస్తోందని చెప్పారు. తన్నుకు పోయిన గద్దల నుంచి భూమిని వెనక్కి రప్పించాలన్నారు. గద్దల నుంచి ఆస్తులు వెనక్కి తీసుకోవాలని, డిపాజిటర్లకు సొమ్ము తిరిగి ఇవ్వాలని, బాధితుల తరఫున ఇదే తన డిమాండ్ అన్నారు. అసెంబ్లీలో ఆశ్చర్యకరమైన విషయాలు చోటు చేసుకున్నాయన్నారు. నా స్వరం అగ్రిగోల్డ్ బాధితుల గొంతుక అన్నారు. బోఫోర్స్, కోల్, స్పెక్ట్రం కుంభకోణం కంటే అగ్రిగోల్డ్ స్కాం చాలా పెద్దది అన్నారు. రూ.1,182 కోట్లు ఇస్తే 13 లక్షల బాధితులను ఆదుకోవచ్చన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Friday said that Agrigold is big scam than coal and spectrum.
Please Wait while comments are loading...