Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట!

ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో తన చేపట్టబోయే పాదయాత్ర పైన కీలక ప్రకటన చేశారు. ఇక పైన ప్రతిరోజు చంద్రబాబుకు సినిమా చూపిస్తానని ఆయన స్పష్టం చేశారు. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుది ఏకంగా క్రెడిట్‌ దోపిడి : వైఎస్ జగన్

ఎన్నికలలో ఏ హామీ నిలబెట్టుకోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది అన్నారు. జగన్ పథకాలన్నింటినీ రద్దు చేశారని పేర్కొన్నారు. సూపర్ 6, సూపర్ సెవెన్ పథకాలు అంటూ పచ్చి మోసానికి పాల్పడ్డారని టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. చంద్రబాబుది ఏకంగా క్రెడిట్‌ దోపిడి అని పేర్కొన్న జగన్ ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్‌ ఇచ్చారన్నారు.

ys jagan announced on his padayatra will start soon made shocking comments on ap cm chandrababu

తమ ప్రభుత్వ హయాంలోనే మిట్టల్ గ్రూప్ తో చర్చలు

2022లో దావోస్‌ పర్యటనలో ఆదిత్య మిట్టల్‌తో చర్చలు జరిపినట్టు పేర్కొన్నారు. అప్పుడే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై సూత్రప్రాయ అంగీకారం వచ్చిందన్నారు. అప్పుడే గ్రీన్‌కోలో రూ.4800 కోట్ల మిట్టల్‌ పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఎస్సార్‌ కొనుగోలు, విస్తరణ అప్పుడే జరిగిందన్నారు.ఆ తర్వాతే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు మూడు ప్రదేశాలు చూపించామని, ఎన్నికలకు ముందే నక్కపల్లి ని ఎంపిక చేశామని అన్నారు.

నియోజకవర్గాల పెంపు, సీట్ల పెంపుపై జగన్ హర్షం

అదే నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ప్రాజెక్ట్‌ ఏమైంది? అని ప్రశ్నించారు.కావాలనే భూవివాదాన్ని సృష్టిస్తున్నారన్నారు. జగన్‌ 2.0 లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు.నియోజకవర్గాల పెంపు శుభవార్త అని చెప్పిన జగన్, సీట్ల పెంపు హర్షణీయం అన్నారు.ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సీట్లు గణనీయంగా పెంపు చేసినట్టు జగన్ వేరు పేర్కొన్నారు. అసెంబ్లీ, ఎంపీ సీట్ల పెంపుతో ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు.

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కూటమి సర్కార్

గట్టిగా పని చేసే వారికి, పటిమ ఉన్న వారికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు.నాయకులుగా ఎదిగేందుకు కార్యకర్తలకు అవకాశం ఇస్తామన్నారు.రెండేళ్లలోనే రాష్ట్రం మొత్తం అప్పల కుప్పగా మారిందని చెప్పిన జగన్ రూ.3.37 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని ఆరోపించారు. తెచ్చిన అప్పంతా ఏమైపోతుందో చెప్పాలన్నారు. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదని ఎక్కడికక్కడ యదేచ్చగా దోపిడీ పరం కొనసాగుతుందన్నారు.

ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కార్ కు ఓటమి తప్పదు

మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి, లాటరైట్ దేనిని వదిలిపెట్టడం లేదని, అంతా దోపిడీ అని టార్గెట్ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అన్నారు. పిల్లలు చదువులకు దూరమవుతున్నారు అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం నాశనం అయ్యాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ఓటమి తప్పదని జగన్ వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+